//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఓటు హక్కును గుర్తుచేయనున్న ఫేస్‌బుక్

Category : national

ఓటు వేసే వయస్సు ఉన్న ఫేస్‌బుక్ వినియోగదారులకు ఓటరుగా నమోదు చేసుకోవాలనే విజ్ఞప్తి త్వరలో ఫేస్‌బుక్‌పై కనిపించనున్నది. ఓటరుగా నమోదు చేసుకోవాలని కోరుతూ ఓటర్ రిజిస్ట్రేషన్ రిమైండర్‌ను జూలై ఒకటో తేదీన పంపనున్నట్లు ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో పేర్కొంది. ఈ రిమైండర్ 13 భాషల్లో ఉంటుంది. రిజిస్టర్ నౌ అనే బటన్‌పై క్లిక్ చేయగానే జాతీయ ఓటరు సేవా పోర్టల్ www.nvsp.in ప్రత్యక్షమవుతుంది. అందులో నూతన ఓటరుగా రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఏ ఒక్క ఓటరును విస్మరించవద్దు అనే నినాదంలో భాగంగా నూతన ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించామని ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ నజీమ్ జైదీ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా నూతన ఓటర్ల నమోదుకు ఫేస్‌బుక్‌ను వినియోగించుకోవడం ఇదే మొదటిసారి.