ఫేస్బుక్ సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కు రెండవ బిడ్డ పుట్టింది. ఆ పాపకు ఆగస్ట్ అని పేరు పెట్టారు. ఆ శిశువు ఆగస్ట్ నెలలో పుట్టింది కాబట్టి, ఆ నెలకు సెట్ అయ్యేలా పేరు పెట్టారనుకుంటున్నారా. కాదు, దీని వెనుక మరో స్టోరీ కూడా ఉంది.
ఆగస్ట్ అనే పేరును ఆగస్టస్ అనే లాటిన్ పదం నుంచి తీసుకున్నారు. ఆగస్ట్ అనే పదానికి బేబీ సెంటర్ అర్థాలను తెలిపింది. భక్తి అని లేదా గొప్పగా గుర్తించడం అని అగస్ట్‌కు మరికొన్ని అర్థాలున్నాయి. ఆగస్ట్ అనే పేరు అమ్మాయిల కంటే అబ్బాయిలకే ఎక్కువగా ఉంటుంది.
2016లో ఆగస్ట్ అనే పేరుకు ఎక్కువ పాపులార్టీ వచ్చింది. జుకర్‌బర్గ్, చాన్‌లు తమ మొదటి బిడ్డకు మ్యాక్స్ అని పేరు పెట్టారు. అది కూడా లాటిన్ పదం మాక్సిమస్ నుంచి ఆ పేరును గ్రహించారు. ఆగస్ట్ పుట్టిన సందర్భంగా జుకర్‌బర్గ్ ఓ స్టేట్మెంట్ ఇచ్చాడు.