//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ముఖం చూసి వారి ఆర్ధిక స్థాయి తెలుసుకోవచ్చు !

Category : editorial

ముఖం చూసి ఎదుటి వ్యక్తి సామాజిక స్థాయి ఏమిటో, వారు ధనికులో, పేదవారో చెప్పడం సాధ్యమని ఒక అధ్యయనం తెలిపింది. కెనడాలోని టోర్నడో యూనివర్సిటీ పరిశోధకులు ఒక మధ్యతరగతి కుటుంబ వార్షిక ఆదాయం 75 వేల డాలర్లు అని అంచనా వేసి, విద్యార్థి వాలంటీర్లను వార్షిక కుటుంబ ఆదాయం 60 వేల డాలర్లు, అంత కన్నా ఎక్కువగా ఉన్నవారిని ఒక బృందంగా; లక్ష డాలర్లు అంతకన్నా ఎక్కువగా ఉన్న మరొకరిని మరో బృందంగా నిలబడమని,  వారి ఫోటోలు తీసుకున్నారు. 

మరో బృందం విద్యార్థులకు ఈ ఫోటోలను ఇచ్చి వారి ముఖకవళికలు బట్టి వారు ధనికులో, పేదలో అంచనా వేయమని కోరారు. 53 శాతం మంది విద్యార్థులు ఫోటోలను బట్టి ఆయా విద్యార్థుల కుటుంబ ఆర్ధిక స్తోమతను ఖచ్చితంగా అంచనా వేశారు. అయితే ఫోటోలు తీస్తున్నప్పుడు ఆ విద్యార్థులు ఎటువంటి ఎమోషన్స్ చూపకుండా ప్రశాంతంగా నిలబడేటట్లు చేశారు. 

18 నుండి 22 ఏళ్ళ మధ్య వయస్సుగల ఈ విద్యార్థులు అప్పటికే తగిన జీవిత అనుభవం సంపాదించి ఉండడంతో, వారి ముఖకవళికలలో వారి ఆర్ధిక, సామాజిక పరిస్థితులు ప్రతిబింబిస్తాయని అసిస్టెంట్ ప్రొఫెసర్ నికోలస్ రూల్ చెప్పారు. జీవితంలో అనుభవాలు పొందుతూ ఉన్న కోలది మన భావాలను ఎంతగా  కప్పిపుచ్చుకొనే ప్రయత్నం చేసినా మన ముఖంలో వాటికి సంబంధించిన చిహ్నాలు ప్రతిబింబిస్తూనే ఉంటాయని తెలిపారు. 

అయితే ముఖంలో ఎటువంటి భావాలు వ్యక్తం చేయకుండా ఉన్నప్పుడే ముఖకవళికలు పరిశీలించడం వీలవుతుందని, వారు నవ్వుతూనో, మరే విధమైన ఎమోషన్ ను వ్యక్తం చేస్తూనో ఉంటె సాధ్యం కాదని పరిశోధకులు చెబుతున్నారు.  ఒక వ్యక్తిలో మనం మొదటగా చూసెడిది వారి మొఖాన్ని గదా. అందుకనే ముఖాన్ని ఒక వ్యక్తికి సూచికగా భావిస్తూ ఉంటాము. మన మెదడులో ముఖ కవళికలు గుర్తించే నరాలు ఉంటాయని శాస్త్రజ్ఞులు చెబుతున్నారు.