Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎఫ్-2 సినిమా సూపర్ హిట్ అయిన కూడా ఆ హిట్ నీ ఎంజాయ్ చేయలేక పోతున్న మెగా ప్రిన్స్.

Category : movies

తాజాగా ఎఫ్-2 సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకటేష్, వరుణ్ తేజ్ లు ఈ సినిమా మంచి పేరు సంపాదించుకున్నారు.అయితే ఈ సినిమాలో వరుణ్ తేజ్ కంటే విక్టరీ వెంకటేష్ హే ఎక్కువ క్రెడిట్ దక్కడంతో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కాస్త డైలమాలో పడ్డాడు.తనకు రావల్సిన క్రెడిట్ కాస్త సీనియర్ హీరో వెంకటేశ్ రావడంతో సైలెంట్ అయిన వరుణ్.మరో సోలో సూపర్ హిట్ కోసం ఎదురు చూస్తున్నాడు. గత ఏడాది తొలిప్రేమతో ఓ బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్న విజయ్.అదే ఏడాది అంతరిక్షం అనే సినిమా రూపంలో ఓ భారీ డిజాస్టర్ ని సమానంగా తన ఖాతాలో వేసుకున్నాడు.ఈ సమయంలోనే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గబ్బర్ సింగ్ ఫేమ్ హరీష్ శంకర్ కాంబోలో వస్తున్న వాల్మీకి అనే సినిమా రాబోతుంది ఇప్పటికే ఈ సినిమా మీద చాలా ఆశలు పెట్టుకున్నాడు వరుణ్.

అంతే కాకుండా ఇందులో హీరో క్యారెక్టర్ కాస్త నెగటివ్ షేడ్స్ నీ కొంత గా టచ్ చేస్తూ చాలా టిపికల్ గా అనిపించే డిఫరెంట్ రోల్ ని ఇందులో ట్రై చేస్తున్నాడు వరుణ్ . ఊర మాస్ అనిపించే తరహాలో ఇప్పటికే లీకుల రూపంలో బయటికి వచ్చిన స్టిల్స్ లో వరుణ్ చూసి ఇతనేనా అని అభిమానులు సైతం ఆశ్చర్య పోయారు. అతి త్వరలోనే ప్రీ టీజర్ ని రిలీజ్ చేయబోతున్నట్టు దర్శకుడు హరీష్ శంకర్ సోషల్ మీడియాలో రంజాన్ సందర్భంగా ప్రకటించాడు. వాల్మీకి ఎలా ఉండబోతుందన్న క్యురియాసిటికి అది కొంత సమాధానం ఇస్తుందనే ఎదురు చూస్తున్నారు ఫాన్స్. ఇది నాలుగేళ్ల క్రితం వచ్చిన తమిళ్ హిట్ జిగర్ తాండా కి ఈ సినిమా అఫీషియల్ రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే వివిధ మాధ్యమాల్లో దిని వెర్షన్ ని చూసినవాళ్ల సంఖ్య ఎక్కువగానే ఉంది.

సో దానితో పోలిక రాకుండా హరీష్ శంకర్ దీన్ని ఎలా తీర్చిదిద్ది ఉంటాడా...? అనే ఉత్సుకత ప్రేక్షకుల్లో ఉంది. పైగా చాలా గొప్పగా చెప్పుకున్న డిజే సినిమా ఫలితం నిరాశ పరచడంతో పాటు విమర్శకులను అవసరానికి మించి దుమ్మెత్తి పోయడం అప్పట్లో హరీష్ ని ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అందుకే వాల్మీకికి వాటితో సమాధానం చెప్పాల్సిన బాద్యత అయితే ఉంది. అధర్వ హీరో తరహ పాత్రలో నటిస్తున్న వాల్మీకిలో ఇంతకీ పూజా హెగ్డే ఉందా లేదా అనే సస్పెన్స్ మాత్రం ఇంకా వీడలేదు. ఇంకో అయిదు నెలల్లో షూటింగ్ పూర్తి చేసే ప్లాన్ లో ఉందట ...ఈ చిత్ర యూనిట్. సైరా అఫీషియల్ గా ప్రకటించాక దీని విడుదల తేదిని డిసైడ్ చేసే ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. చూడాలి మరి ఈ సినిమాతో అయిన వరుణ్ తేజ్ మరో మారు సూపర్ హిట్స్ కొడతాడా లేదా చూడాలి.

Related News