Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

'ఎఫ్ 2' ఫైవ్ డేస్ కలెక్షన్ ఎంతో తెలుసా ....

Category : movies

ఈ నెల 12న సంక్రాంతి అల్లుళ్ళగా వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన సినిమా 'ఎఫ్ 2'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా వచ్చిన విషయం అందరికి తెలిసిందే. అయితే అప్పటికే థియేటర్స్ లో 'కథానాయకుడు', 'వినయ విధేయ రామ' సినిమాలు ఉన్నప్పటికీ ఎఫ్ 2 సినిమా పెద్ద హిట్ అవ్వడం అందరిని ఆశ్చర్యపరుస్తుంది. సినిమా విడుదలైన అన్ని ప్రాంతాల్లో ఈ సినిమా భారీ వసూళ్లను రాబడుతూ దూసుకుపోతోంది. మొదటి రోజు నుంచి అయిదోవ రోజు వరుకు ఎంత వసూళ్లు చేసిందో చుడండి.

ఎఫ్ 2 రిలీజ్ అయినా మొదటి రోజు నుంచి 4వ రోజు వరుకు 26కోట్ల షేర్ ను సాధిస్తే 5వ రోజు మాత్రం 7కోట్ల షేర్ ను వాసులు చేసింది. దింతో 5రోజుల్లో ఈ సినిమా 32కోట్లకు పైగా షేర్ ను రాబట్టింది. ఇక వారాంతంలో కొత్తగా వచ్చే సినిమాలు ఏమి లేకపోవడంతో, ఈ సినిమా వసూళ్లు మరింత పెరిగే ఛాన్స్ ఉందని అంటున్నారు. లాంగ్ రన్ లో ఈ సినిమా దాదాపు 60 కోట్ల షేర్ మార్కెట్ ను అందుకోవచ్చని సినీ నిపుణులు వారి అభిప్రాయాలను తెలియ చేస్తున్నారు.

Related News