//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పలు రైళ్లకు అదనపు బోగీలు

Category : world

పలు రైళ్లకు అదనపు బోగీలు ఏర్పాటు చేస్తున్నట్లు విజయవాడ డివిజన్‌ ఇన్‌చార్జి పీఆర్‌వోర్‌కే రాజశేఖర్‌ సోమవారం తెలిపారు. మచిలీపట్నం– యశ్వంత్‌పూర్‌ ఎక్స్‌ప్రెస్‌ (రైల్‌ నంబర్‌: 17211)కు ఈ నెల 8 నుంచి డిసెంబర్‌ 1 వరకు అదనంగా ఒక థర్డ్‌ ఏసీ బోగీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

అలాగే యశ్వంత్‌పూర్‌– మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌(17212)కు ఈ నెల 9 నుంచి డిసెంబర్‌ 2 వరకు, మచిలీపట్నం–సికింద్రాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ (12749)కు ఈ నెల 6 నుంచి 30 వరకు, సికింద్రాబాద్‌–మచిలీపట్నం ఎక్స్‌ప్రెస్‌(12750)కు ఈ నెల 7 నుంచి డిసెంబర్‌ 1 వరకు థర్డ్‌ ఏసీ బోగీ అదనంగా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

కాగా, సాంకేతిక కారణాల దృష్ట్యా ఈనెల 6– 12 వరకు విజయవాడ–భద్రాచలం–విజయవాడ రైలు వేళల్లో మార్పులు చేస్తున్నట్లు రాజశేఖర్‌ తెలిపారు. ఈ తేదీల్లో విజయవాడ– భద్రాచలం రైలు (77292) ఉదయం 10కి బయలుదేరుతుందని చెప్పారు. భద్రాచలం– వయా ఖమ్మం- విజయవాడ రైలు (77291) మధ్యాహ్నం 3.45కు బయలుదేరుతుందని పేర్కొన్నారు.