Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

విశాఖలో టిడిపికి చెక్ : జగన్ గూటికి మాజీ ఎమ్మెల్యే

Posted 16 days ago | Category : politics

తెలుగుదేశం పార్టీ అనుసరిస్తున్న విధానాన్ని వైసీపీ కూడ అవలంభించాలని చూస్తోంది. ఇతర పార్టీల నుండి బలమైన నేతలను తమ పార్టీలోకి ఆహ్వనించాలని వైసీపీ ప్లాన్ చేస్తోంది.కొత్తగా పార్టీలో చేరే నేతలకు తాము కోరుకొన్న చోట పోటీ చేసేందుకు ఆవకాశాలు కల్పించాలని యోచిస్తున్నట్టు సమాచారం.

విశాఖ జిల్లాలో అధికార పార్టీ వ్యూహలకు వైసీపీ ప్రతి వ్యూహలను రచిస్తోంది. ఏపీ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు వైసీపీ చీఫ్ వైఎస్ జగన్ ఇప్పటి నుండి వ్యూహ రచన చేస్తున్నారు. అయితే అధికార పార్టీ లోకి వైసీపీ నేతలు, ప్రజా ప్రతినిధులు వలసలు సాగుతున్నాయి.

ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకొని అధికార పార్టీలోని అసంతృప్త నేతలతో పాటు ఇతర పార్టీల్లోని బలమైన నేతలను తమ వైపుకు తిప్పుకొనేందుకు వైసీపీ ప్లాన్ చేస్తోంది. ఈప్లాన్ ప్రకారంగా టిడిపిలో చేరిన నేతల కారణంగా పార్టీలో ఏర్పడిన లోటును భర్తీ చేసుకోవాలని వైసీపీ చీఫ్ భావిస్తున్నారు.

ప్రజా సమస్యలపై నిరంతర పోరాటం చేస్తున్న రాజన్న తనయుడికి మద్దతుగా నిలిచేందుకు నాయకులు వైఎస్సార్‌సీపీలో చేరుతున్నారు. తాజాగా విశాఖపట్నం జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే కుంభా రవిబాబు తన అనుచరులతో కలిసి వైఎస్సార్‌సీపీలో చేరారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైఎస్ జగన్‌ సమక్షంలో ఆయన పార్టీలోకి వచ్చారు. పార్టీ కండువాలతో వారిని వైఎస్‌ జగన్ సాదరంగా ఆహ్వానించారు.

ఈ సందర్భంగా రవిబాబు మాట్లాడుతూ... గిరిజనులంతా వైఎస్‌ జగన్‌ నాయకత్వాన్ని కోరుకుంటున్నారని అన్నారు. జగన్‌ ముఖ్యమంత్రి అయితేనే గిరిజన హక్కులు రక్షించబడతాయని వ్యాఖ్యానించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు గిరిజనులు తగిన బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు.


పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

Posted 3 hours ago | Category : politics

పవన్ కి పంచ్ వేసిన అచ్చెన్న !

నెల్లూరులో జగన్...

Posted 3 hours ago | Category : politics

నెల్లూరులో జగన్...

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

Posted 19 hours ago | Category : politics

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో 125 స్థానాల్లో గెలుస్తాం

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

Posted 20 hours ago | Category : politics

2019లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

Posted a day ago | Category : politics

జన సేన భవిష్యత్ కార్యాచరణ ఇదే ?

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

Posted a day ago | Category : politics

ట్రిపుల్‌ తలాక్‌ ఫై అసదుద్దీన్‌ ఒవైసీ సీరియస్

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

Posted a day ago | Category : politics

తెలంగాణ అంటే నాకు ప్రాణం: పవన్ కళ్యాణ్

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

Posted 2 days ago | Category : politics

పవన్ కల్యాణ్‌ పర్యటన పై సంచలన కామెంట్స్ చేసిన పొన్నం ప్రభాకర్

పవన్‌ పై టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

Posted 2 days ago | Category : politics

పవన్‌ పై  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ వివాదాస్పద వ్యాఖ్యలు

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

Posted 2 days ago | Category : politics

'వీర మహిళ'ని రెడీ చేసిన పవన్

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ

Posted 2 days ago | Category : politics

బ్రేకింగ్ : ఎమ్మెల్యే రోజా ఇంట్లో చోరీ