//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

14 ఏళ్ల త‌రువాత అజ్ఞాతం వీడి రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇచ్చిన పాణ్యం సింహం..!

Category : politics

ఏపీ ముఖ్య‌మంత్రి నారా చంద్ర‌బాబు నాయుడు వ్యూహం ప‌లించింది. దీంతో అప్ప‌టి వ‌ర‌కు అజ్ఞాతంలో ఉన్న పాణ్యం సింహం ఒక్క‌సారిగా మ‌ళ్లీ టీడీపీలోకి ఎంట్రీ ఇచ్చింది. పాణ్యం సింహం రాజ‌కీయాల్లోకి రీ ఎంట్రీ ఇవ్వ‌డంతో ఇక రాయ‌ల‌సీమ‌లో టీడీపీ క్లీన్‌స్వీప్ చేయ‌డం ఖాయ‌మ‌నే భావాన్ని వ్య‌క్తం చేస్తున్న ఆ పార్టీ నేత‌లు. ఇంత‌కీ ఎవ‌రా నేత‌...? సుమారు 14 ఏళ్ల త‌రువాత ఎందుకు రాజ‌కీయ అజ్ఞాతం వీడారు..? అత‌ను అజ్ఞాతంలోకి వెళ్లాల్సిన అవ‌స‌రం ఏమిటి..? అత‌ను రాజ‌కీయాల్లోకి చ‌ంద్ర‌బాబు ర‌చించిన వ్యూహం ఏమిటి..? అన్న ప్ర‌శ్న‌ల‌కు స‌మాధానం తెలియాలంటే.. ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే.

ఇక అస‌లు విష‌యానికొస్తే, మ‌నం ఇప్ప‌టి వ‌ర‌కు చెప్పుకున్న, 14 ఏళ్ల త‌రువాత అజ్ఞాతం వీడిన వ్య‌క్తే మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్ధ‌సార‌ధిరెడ్డి. ప్ర‌స్తుతం ఆయ‌న కేవ‌లం పాణ్యం నియోజ‌క‌వ‌ర్గంలోనే కాకుండా, క‌ర్నూలు జిల్లా వ్యాప్తంగా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ ప్ర‌జ‌ల్లో గుప్తింపు తెచ్చుకుంటున్నారు. అలా, ఆయ‌న జిల్లా మొత్తం మీద సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించేందుకు కార‌ణం కూడా ఉంద‌ని, 2019 సాధార‌ణ ఎన్నిక‌ల్లో క‌ర్నూలు లోక్‌స‌భ స్థానం నుంచి టీడీపీ త‌రుపున పోటీ చేయాలన్న‌దే బిజ్జం పార్ధ‌సార‌ధిరెడ్డి ఉద్దేశ‌మేన‌ని ఆయ‌న అనుచ‌రులే చెబుతున్నారు.

అయితే, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాట‌సాని రాంభూపాల్‌రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే బిజ్జం పార్ధ‌సారధిరెడ్డి కుటుంబాల మ‌ధ్య ద‌శాబ్దాల కాలం పాటు క‌ర్నూలు జిల్లా రాజ‌కీయాల‌పై ప‌ట్టుకోసం ఆధిప‌త్య పోరు జ‌రిగిన విష‌యం తెలిసిందే. అంతేకాకుండా, కొన్ని సంద‌ర్భాల్లో అనుకోకుండా ఎదురుప‌డ్డ సంద‌ర్భాల్లో బాహాబాహీకి దిగారు కూడా. ఇప్ప‌టికీ అదే ప‌రిస్థితి. అయితే, ఈ ఆధిప‌త్య పోరు ఇప్ప‌టిది కాద‌ని, కాట‌సాని, బిజ్జం తండ్రుల కాలం నుంచి ప‌రిస్థితి ఇలానే కొన‌సాగుతూనే ఉంద‌ని చెబుతున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

ఇలా వారి మ‌ధ్య ఫ్యాక్ష‌న్ గొడ‌వ‌లు నిత్యం కొన‌సాగుతున్న క్ర‌మంలో 2004లో అధికారంలో ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు చేప‌ట్టిన వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి బిజ్జం, కాట‌సాని మ‌ధ్య స‌యోధ్య కుదిర్చేందుకు య‌త్నించినా అది విఫ‌ల‌య‌త్నం అయింది. ఆ త‌రువాత ఇక‌పై మీరు ఇద్ద‌రూ ఫ్యాక్ష‌న్‌కు దూరంగా ఉండాల‌ని సూచించారు వైఎస్ఆర్‌. ఆ క్ర‌మంలో బిజ్జం పార్ధ‌సార‌ధిరెడ్డి కొంత కాలంపాటు ప్ర‌త్య‌క్ష రాజ‌కీయాల‌కు దూరంగా దాదాపు 14 సంవ‌త్స‌రాల‌పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపారు.

అయితే, ప్ర‌స్తుతం టీడీపీ అధికారంలో ఉండ‌టంతో మ‌ళ్లీ రాజ‌కీయాల్లోకి ఎంట్రీ ఇవ్వాల‌నుకుంటున్నారు బిజ్జం పార్ధ‌సార‌దిరెడ్డి. ఆ విష‌యాన్ని తాను స్వ‌యంగా చెప్ప‌క‌పోయినా సేవా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తూ జేజేలు కొట్టించుకుంటూ నిత్యం ప్ర‌జ‌ల్లో తిరుగుతున్నారు. ఈ బిజ్జం చేప‌ట్టిన సేవా కార్య‌క్ర‌మాలు కేవ‌లం పాణ్యంలోనే కాకుండా, క‌ర్నూలు జిల్లా వ్యాప్తంగా కొన‌సాగ‌డం విశేషం. పాణ్యంతోపాటు జిల్లా వ్యాప్తంగా సేవా కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డంతో బిజ్జం పార్ధ‌సార‌ధిరెడ్డి పాణ్యం ఎమ్మెల్యేగా పోటీ చేస్తారా..? లేక క‌ర్నూలు ఎంపీగా పోటీ చేస్తారా..? అన్న అనుమానాలు ఇప్పుడు రాజ‌కీయ వ‌ర్గాల్లో రేకెత్తుతున్నాయి. ఈ ప్ర‌శ్న‌లకు స‌మాధానం తెలియాలంటే పార్ధ‌సార‌ధి రీ ఎంట్రీపై మ‌రొకిద్ది రోజుల్లో మీడియా స‌మావేశంలో సీఎం చంద్ర‌బాబు చెప్పేవ‌ర‌కు ఆగాల్సిందేనంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు.

Related News