//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

టీడీపీ ఫై మాజీ మంత్రి రావెల సంచలన వ్యాఖ్యలు....!

Category : politics

ఆంధ్ర ప్రదేశ్ లోని టీడీపీ ప్రభుత్వం లో దళిత ప్రజాప్రతినిధులకు గౌరవం లేదని, తమ ఆత్మగౌరవం దెబ్బతింటోందని అంటూ మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్యే రావెల కిశోర్‌బాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈయన ఈమధ్యే ఓ టీవీ చానల్‌తో మాట్లాడుతూ పదవులు మతమే మావి అని పెత్తనం మాత్రం వాళ్లదా అని నిలదీశారు. దళిత మంత్రులు, ఎమ్మెల్యేలకు కనీస గౌరవం కూడా ఇవ్వడం లేదని అయన చెప్పారు .

నా ఒక్క నియోజకవర్గంలోనే కాదు. రాష్ట్రవ్యాప్తంగా వున్న అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో అగ్రకుల నేతల పెత్తనమే ఎక్కువగా వుంటుంది అని చెప్పారు. ఎస్సీ మంత్రులు, ఎమ్మెల్యేలకు పదవులు మాత్రమే ఉన్నాయి కానీ అధికారం మాత్రం వేరొకరి చేతులలో ఉంటుంది . కోడుమూరు ఎమ్మెల్యే మణిగాంధీని నామమాత్రపు ఎమ్మెల్యేగా చూస్తున్నారు అని పెత్తనం మొత్తం అక్కడి టీడీపీ నియోజకవర్గ ఇన్‌చార్జి విష్ణువర్థన్‌రెడ్డి చలాయిస్తున్నారని చెప్పారు .

కొవ్వూరు నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహిస్తూ రాష్ట్ర ఎక్సైజ్‌ మంత్రి పదవిలో జవహర్‌ ఉన్నప్పటికీ పెత్తనం మొత్తం సుబ్బరాజు చౌదరి చేస్తుంటాడు. పశ్చిమ గోదావరి జిల్లా గోపాలపురం ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు అధికారం మొత్తం అక్కడి చైర్మన్‌ బాపిరాజు చేతుల్లో ఉంటోంది. మంత్రి నక్కా ఆనందబాబు పదవిలో ఉండగా, వేమూరు నియోజకవర్గంలో అధికారమంతా తెనాలి ఎమ్మెల్యే ఆలపాటి రాజా చేతుల్లోనే ఉంది. ప్రకాశం జిల్లా కొండెపిలో ఎమ్మెల్యే పదవి స్వామిది, అధికారం చెలాయించేది మాత్రం జిల్లా టీడీపీ అధ్యక్షుడు జనార్దన్‌.

ఇవి కొన్ని మాత్రమే అని, దాదాపు అన్ని ఎస్సీ నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి వున్నదని చెప్పారు . కేవలం నామమాత్రపు నాయకత్వాన్ని ఇచ్చి అధికారం పక్కవాళ్లు చెలాయిస్తే దళితుల్లో తీవ్ర వ్యతిరేకత వస్తుంది.

నా నియోజకవర్గం పరిధిలోని ఓబులునాయుడుపాలెం గ్రామంలో అక్రమ మైనింగ్‌లో మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హస్తం ఉందనే ఆరోపణలు వినిపిస్తే ఆయన చెప్పా. ఎవరికి చెప్పినా ఉపయోగం లేకుండాపోయింది. నాకు వాటా పంపుతున్నామని ప్రచారం చేసి నా పేరుప్రతిష్టలను దిగజార్చడంతో అసలు ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు విలేకరులను తీసుకుని అక్కడికి వెళ్లా. యథేచ్ఛగా అక్రమ మైనింగ్‌ జరగడం చూసి ఆశ్చర్యపోయా. నారాయణస్వామి, అశోక్‌ అనేవాళ్లు ఇష్టం వచ్చినట్లు అక్రమ మైనింగ్‌ చేస్తున్నట్లు తేలింది అని రావెల తెలిపారు