Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఆ మంత్రి ఈ సారి ఎమ్మెల్యే గా పోటీ చేస్తుందంట...?

Category : politics

తెలంగాణాలో ఫైర్ బ్రాండ్ అంటే చెప్పుకొనే పేరు రేణుక చౌదరి.., గతంలో మన్మోహన్ ప్రభుత్యంలో మంత్రిగా పని చేసారు. గత లోక్‌సభ ఎన్నికల్లో ఖమ్మం నుంచి పోటీచేసి వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయింది.

అయితే ఇప్పుడు ఈమె చూపు లోక్‌సభ నుంచి అసెంబ్లీ స్థానంపై పడింది. త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలలో ఆమె సొంత నియోజకవర్గం ఖమ్మం అసెంబ్లీ స్థానాన్ని గాని, హైదరాబాద్‌ నగరంలో సెటిలర్స్‌ అధికంగా ఉండే మరో నియోజకవర్గం నుంచి గాని పోటీ చేసే అవకాశాలున్నాయని సమాచారం.

అయితే ఖమ్మం అసెంబ్లీ స్థానం నుంచి గత ఎన్నికల్లో గెలిచిన పువ్వాడ అజయ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు ఆ స్తానం ఖాళీగా ఉండటంతో వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ తరుపున ఖమ్మం నుంచి బరిలోకి దిగాలని ఆమె ఆలోచిస్తున్నటు సమాచారం. ఏదైతేనేమి ఒక పార్లమెంట్ అభ్యర్థి అసెంబ్లీ స్థానానికి పోటీచేయడం చర్చాంచనీయంగా మారింది.

Related News