//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

బ్రేకింగ్ న్యూస్.. రెండో ద‌శ పోలింగ్ లోనూ అదే స‌మ‌స్య ....?

Category : national politics

ప్ర‌స్తుతం దేశంలో రెండో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ జ‌రుగుతుంది . క‌ర్ణాట‌క ,త‌మిళ‌నాడు ,కెర‌ళ ల‌ల‌తో పాటు దాదాపు 11రాష్ట్రల‌లో ఎన్నిక‌లు జ‌రుగుతున్నాయి .ఈ త‌రుణంలో చాలా మంది సెల‌బ్రేటీలు ఇళ్ల‌లో నుండి బ‌య‌టికి వ‌చ్చి మ‌రీ త‌మ ఓటు హ‌క్కును వియోగించుకుంటున్నారు.ఈ సందర్భంగా త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకున్న ప‌లువురు హీరోలు నెట్ లో పోస్ట్ చేయ‌డంతో అవి సోష‌ల్ మీడియాలో హ‌ల్చ‌ల్ చేస్తున్నాయి .

అయితే గ‌త ఎన్నిక‌ల‌లో ఈవీఎంల ప‌ట్ల ఎన్నిక‌ల సంఘం వ్యవ‌హ‌రించిన తీరు స‌రిగా లేక‌పోవ‌డంతో అభ్య‌ర్థులు త‌మ ఓటు హ‌క్కును వినియోగించుకోవ‌డానికి అర్థ‌రాత్రులు వ‌ర‌కు వేయిట్ చేయాల్సి వ‌చ్చింది .అయితే ఇప్పుడు రెండో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్ లో కూడా అదే సీన్ రిపీట్ అయ్యేవిధంగా క‌న‌బ‌డుతున్న‌ట్లు అనిపిస్తుంది . దేశంలోని ప‌లు రాష్ట్రల‌లో ఈవీఎం స‌రిగా ప‌ని చేయ‌డం లేద‌ని అయా పోలింగ్ బూత్ ల అధికారుల నుండి అందుతున్న స‌మాచారం .

దాంతో ఈవీఎంలో సాంకేతిక లోపాలు ఏర్ప‌డ‌డంతో ఓటు వేయ‌డానికి వ‌చ్చిన ఓట‌ర్లు గంట‌ల త‌ర‌బ‌డి లైన్ నిల‌బ‌డుతున్నార‌ని తెలుస్తోంది .అయితే గ‌త ఎన్నిక‌ల‌లో జ‌రిగిన పోరాపాటున ఈ ఎన్నిక‌ల‌లో జ‌ర‌గ‌నీయ‌మ‌ని ఈసీ చెప్పిన ఈ త‌రుణంలో ఈవీఎంలు మొరాయించ‌డంతో అక్క‌డి నేత‌లు ,ఓట‌ర్తు ఈసీ పై మండిప‌డుతున్నారు.