//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అందరి చూపు షరపోవా పైనే.

Category : sports

మరియా షరపోవా పేరు గుర్తుందా? టెన్నిస్ క్రీడాభిమానులలో ఈ పేరు తెలియని వాళ్ళు ఉండరు. టెన్నిస్ క్రీడాకారిణిగా, తన ఆటతో, అందంతో ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది షరపోవా. అంతేకాకుండా పెద్దపెద్ద సంస్థల ప్రచారకర్తగా విపరీతంగా ఆర్జించింది. అంతటి ప్రఖ్యాతిగాంచిన షరపోవా అనూహ్యంగా డోప్ పరీక్షల్లో పట్టుబడి తీవ్ర విమర్శలకు గురైంది.కానీ ఆమె గురించి మనకు తెలియని విషయాలు ఇంకెన్నో ఉన్నాయి. నిషేధం తొలగి పునరాగమనానికి సిద్దమవుతున్న షరపోవా, అలాంటి విషయాలను స్వయంగా మనతో పంచుకోవటానికి తన జీవితగాధకు అక్షర రూపమిస్తూ, ఓ పుస్తకం రాస్తుంది. ఈ పుస్తకం కోసం అభిమానులు నుంచి భారీ ఎత్తున ముందస్తు ఆర్డర్ లు రావటం గమనార్హం.

5 సార్లు గ్రాండ్ స్లామ్ విజేత, నిషేధిత ప్రేరోపకాలు వాడారనే ఆరోపణపై 15 నెలలపాటు టెన్నిస్ క్రీడకు దూరంగా ఉన్న ఈ 30 సంవత్సరాల రష్యన్ క్రీడాకారిణి తన పునరాగమనంపై, తాను ఆడుతున్న తీరుపై పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ, తనపై వచ్చిన ఆరోపణలను తాను పట్టించుకోనని, తాను తన ప్రత్యర్థి ఆట పైనే ద్రుష్టి సారిస్తానని తన పూర్వస్థానాన్ని అందుకోగలనని ధీమా వ్యక్తపరచటం ద్వారా టెన్నిస్ అభిమానులను అలరించటానికి మరోసారి షరపోవా సిద్ధమౌతుందని చెప్పవచ్చు.