సోషల్ మీడియా జెయింట్ ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించింది ఐరోపా యూనియన్ . వాట్సాప్ టేకోవర్ సమయంలో తప్పుడు సమాచారం ఇచ్చారన్న ఆరోపణలపై ఏకంగా 12 కోట్ల డాలర్ల (సుమారు రూ.773 కోట్లు) జరిమానా విధించింది.
ఐరోపా యూనియన్ విలీన నిబంధనలు ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా పాటించాలని, సరైన సమాచారం కూడా ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ తీర్పు ద్వారా స్పష్టమైనట్లు ఈయూ కాంపిటిషన్ కమిషనర్ మార్గరెట్ వెస్టాగర్ అన్నారు.
దీనిపై ఫేస్బుక్ కూడా స్పందించింది. తాము కమిషన్‌కు పూర్తిగా సహకరించామని, జరిగిన పొరపాట్లు ఉద్దేశపూర్వకంగా చేయలేదని స్పష్టంచేసింది. 2014లో సుమారు రూ.లక్ష కోట్లు చెల్లించి వాట్సాప్‌ను సొంతం చేసుకుంది ఫేస్బుక్. అప్పట్లో ఈయూ కూడా దీనికి ఆమోదం తెలిపింది.
మొదట్లో ఫేస్బుక్, వాట్సాప్‌లను వేర్వేరుగా ఉంచుతామని చెప్పిన ఆ సంస్థ 2016లో మాత్రం ఈ రెండింటిలోని యూజర్ల సమాచారాన్ని కలిపే అవకాశం ఉందని ప్రకటించింది. దీనిపైనే విచారణ జరిపిన ఐరోపా మిషన్ ఫేస్‌బుక్‌కు భారీ జరిమానా విధించింది.