//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సైనిక స్కూళ్లలో బాలికలకూ ప్రవేశం...!

Category : national

లక్నో ప్రభుత్వం బాలికలకు శుభవార్త చెప్పింది . దాదాపు గా 57 ఏళ్ల తర్వాత దేశంలోనే మొట్టమొదటిసారి యూపీ సైనిక్ స్కూలులో బాలికలకు కూడా ప్రవేశం కల్పించాలని నిర్ణయం తీసుకున్నారు. తాము కూడా దేశ భద్రతాదళాల్లో చేరి దేశానికి సేవ చేయాలనుకునే బాలికల కలను సైనికస్కూళ్లు సాకారం చేస్తాయని కల్నల్ అమిత్ చటర్జీ ప్రకటించారు.

లక్నోలోని సైనిక స్కూలులో 9వతరగతిలో 15 మంది బాలికలను చేర్చుకునేందుకు మొట్టమొదటిసారి అవకాశం ఇచ్చారు . మన దేశంలో 28 సైనిక స్రూళ్లు, 5 మిలటరీ స్కూళ్లు ఉండగా లక్నో సైనిక స్కూలులో బాలికలను ప్రయోగాత్మకంగా ప్రవేశాలు కల్పించాలని అనుకున్నారు. సైనిక స్కూలులో విద్యనభ్యసించడం తమకెంతో గర్వంగా ఉందని సైనిక స్కూలులో సీట్స్ పొందిన విద్యార్థినులు చెప్పారు.