టీం ఇండియా మళ్ళీ ప్రాక్టీస్ లో మునిగిపోయింది. ఇంగ్లాండ్ గడ్డపై మొదటగా టి ట్వంటీ సిరీస్ గెలిచాక, అదే ఊపుతో వన్డే తొలి మ్యాచ్ లో కూడా గెలిచారు, కానీ తరువాత అనూహ్యంగా వరుస ఓటములతో వన్డే సీరిస్ ని ఓడిపోయారు. ఇప్పుడు టెస్ట్ సిరీస్ కోసం తీవ్రంగా సిద్ధమౌతున్నారు.
ముందుగా ఇంగ్లాండ్ తో ఆడబోయే 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ కి, మొదటి మూడు టెస్టులకి టీంని ప్రకటించారు. ఇందులో లోకేష్ రాహుల్, దినేష్ కార్తీక్, కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్య, ఉమేష్ యాదవ్, శారదల్ ఠాకూర్, మురళీ విజయ్, చేతేశ్వర్ పుజారా, అజింక్య రహానే, కరుణ్ నాయర్, రిషభ్ పంత్, రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, జాస్ప్రిత్ బుమ్రా , ఇషాంత్ శర్మ, మొహమ్మద్ షామి, విరాట్ కోహ్లీ, ధావన్
ప్రకటించిన 18మంది సభ్యుల జట్టులో యువ వికెట్‌కీపర్ రిషత్ పంత్‌కు స్థానం కల్పించగా, అతనితో పాటు స్పెషలిస్ట్ వికెట్‌కీపర్, బ్యాట్స్‌మెన్‌గా దినేశ్ కార్తీక్ చోటు దక్కించుకున్నాడు. హిట్‌మ్యాన్ రోహిత్ శర్మకు ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో అవకాశం దక్కలేదు. అలాగే వెన్ను నొప్పి కారణంగా బౌలింగ్ స్పెసలిస్ట్ భువనేశ్వర్ కుమార్ కి చోటుదక్కలేదు.