ఇంగ్లండ్తో జరుగుతున్న తొలి టెస్టులో భారత జట్టు విజయం నుంచి ఓటమి అంచుల్లోకి జారుకుంది. స్కిప్పర్ కోహ్లీ క్రీజులో ఉన్నంత సేపు భారత్ విజయం ఖాయమని అభిమానులు ఊహించారు.
అయితే, స్టోక్స్ బౌలింగ్లో కోహ్లీ (51) ఎల్బీ అయ్యాక ఒక్కసారిగా ఆట తారుమారైంది. కోహ్లీ అవుటయ్యాక క్రీజులోకి వచ్చిన షమీ డకౌట్ కావడంతో భారత్ ఆశలు దాదాపు అడుగంటాయి.
ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన ఇషాంత్ శర్మ (11) నిలదొక్కుకోవడంతో భారత శిబిరంలో ఆశలు చిగురించాయి. అయితే, ఆదిల్ రషీద్ బౌలింగ్లో ఇషాంత్ శర్మ వికెట్ ముందు దొరికిపోవడంతో భారత ఆశలు నీరుగారిపోయాయి. చివరి వికెట్ గా హార్దిక్ పాండ్యా వెనుదిరగడం తో భారత్ ఓటమి ఖరారైంది.