సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు వార్నర్ స్థానం లో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ ను తీసుకుంది. ఈ ఊహించని పరిణామం తో ఇంగ్లాండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ ఐపీల్ లో కనిపించబోతున్నాడు. వార్నర్ బాల్ టాంపరింగ్ లో దొరికి పోయిన సందర్భంగా అతనిని ఆస్ట్రేలియా బోర్డు ఒక ఏడాది అతనిపై నిషేధం విధించింది.
రిజిస్టర్డ్ అండ్ అవైలబుల్ ప్లేయర్ పూల్ జాబితాలో కోటి రూపాయల బేస్ ప్రైస్‌తో ఉన్న హేల్స్‌ను ఎస్ఆర్హెచ్ సొంతం చేసుకున్నట్టు బీసీసీఐ ప్రకటించింది. సన్‌రైజర్స్ జట్టు కెప్టెన్ అయిన వార్నర్ పై ఏడాది వేటు పడి ఐపీఎల్‌కు దూరం కావడంతో కేన్ విలియమ్సన్కు సారథ్య బాధ్యతలు అప్పజెప్పిన హైదరాబాద్, వార్నర్ స్థానాన్ని అలెక్స్ హేల్స్‌తో భర్తీ చేయనుంది.
ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్‌లో టాప్-10 ఉన్న ఒకే ఒక్క ఇంగ్లిష్ బ్యాట్స్‌మన్ హేల్సే. మొత్తం 52 టీ20లు ఆడిన హేల్స్ 31.65 సగటుతో 136.32 స్ట్రైక్ రేట్‌తో 1456 పరుగులు చేశాడు.