//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వన్డే క్రికెట్ లో సంచలనం......ఇంగ్లాండ్@ 481

Category : sports

పురుషుల వన్డే క్రికెట్‌లో ఇంగ్లండ్‌ జట్టు సంచలనం. అలెక్స్‌ హేల్స్‌ (92 బంతుల్లో 16 ఫోర్లు, 5 సిక్సర్లతో 147), బెయిర్‌స్టో (92 బంతుల్లో 15 ఫోర్లు, 5 సిక్సర్లతో 139) ఆకాశమే హద్దుగా చెలరేగిన వేళ ఇప్పటిదాకా తమ పేరిటే ఉన్న అత్యధిక పరుగుల రికార్డును అధిగమించింది. మంగళవారం ఆస్ట్రేలియాపై జరిగిన మూడో వన్డేలో ఆతిథ్య జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 481 పరుగుల భారీ స్కోరు సాధించింది.

ఓపెనర్‌ జేసన్‌ రాయ్‌ (61 బంతుల్లో 7 ఫోర్లు, 4 సిక్సర్లతో 82) అర్ధ సెంచరీ చేయగా ఆఖర్లో ఇయాన్‌ మోర్గాన్‌ (30 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్సర్లతో 67) తుఫాన్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. తొలి వికెట్‌కు బెయిర్‌స్టో.. రాయ్‌తో కలిసి 159 పరుగులు, రెండో వికెట్‌కు హేల్స్‌తో కలిసి 151 పరుగులు జత చేశాడు.

ఇక ఇంగ్లండ్‌ బ్యాట్స్‌మెన్‌ ధాటికి ఆసీస్‌ బౌలర్లు పూర్తిగా చేతులెత్తేశారు. ఆండ్రూ టై 9 ఓవర్లలో ఏకంగా 100 పరుగులు సమర్పించుకున్నాడు. రిచర్డ్‌సన్‌ 3 వికెట్లు తీసుకున్నా 93 పరుగులివ్వగా.. స్టొయినిస్‌ 8 ఓవర్లలో 85 పరుగులు ఇచ్చాడు.

అనంతరం రికార్డు ఛేదనకు బరిలోకి దిగిన ఆస్ట్రేలియా 37 ఓవర్లలో 239 పరుగులు చేసి ఆలౌట్ అయింది. వేగంగా పరుగులు చేసే క్రమంలో ఆసీస్ వికెట్లను కాపాడుకోలేకపోయింది. ఓపెనర్‌ మాథ్యూ హేడ్‌ (39 బంతుల్లో 7 ఫోర్లతో 51) అర్ధసెంచరీ చేయగా స్టొయి నిస్‌ (37 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్స్‌తో 44) రాణించాడు. విల్లే 2 వికెట్లు, మొయిన్‌ అలీ 3 వికెట్లు, రషీద్‌లకు 4 వికెట్లు దక్కాయి.