అణుబాంబులు విసురుతానంటూ ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ను అంతమొందించేందుకు శత్రుదేశాలు వ్యూహాత్మకంగా అడుగులు ముందుకేస్తున్నాయి. తనకు పక్కలో బల్లెంలా మారిన కిమ్‌ను ఎలాగైన చంపేయాలని ఫిక్స్ అయిపోయిన దక్షిణ కొరియా.ఇందుకోసం ప్రత్యేకంగా ఓ టీమ్‌ను తయారుచేసింది. కిమ్‌ను చంపేందుకు వారికి ప్రత్యేకమైన శిక్షణను ఇస్తోంది. స్పార్టన్ 3000 పేరుతో తయారుచేసిన ఈ టీమ్ ఉత్తర కొరియాలోకి చొరబడి ఆదేశ అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ను అంతమొందించాలని తలపిస్తోంది.
ఇలా ఉత్తరకొరియాలోకి చొరబడిన ప్రత్యేక టీమ్ చేతికి దొరికిన ఉత్తరకొరియన్ల తలలు నరికేస్తుంది అని ఆదేశానికి చెందిన నిపుణులు అంటున్నారు. అయితే ఇలాంటి టీమ్‌లను తయారుచేసి ఉత్తర కొరియాలోకి పంపడం దక్షిణ కొరియాకు కొత్తేమీ కాదు. గతంలోనూ ఉత్తర కొరియా అధ్యక్షుడు కిమ్ సంగ్ 2 ను చంపడానికి ఇదే మాదిరిగా ప్రయత్నించింది.అయితే ఆ ప్రయత్నం విఫలమైంది. కిమ్ సంగ్‌ను చంపడానికి ప్రయత్నించిన వారిలో కొందరు పారిపోయి సురక్షితంగా దక్షిణ కొరియా చేరుకోగా, మరికొందరు ఉత్తర కొరియన్లకు చిక్కకుండా తమను తామే చంపుకున్నారు.మరి ఈ సారి ఏమి జరుగుతుందో వేచి చదలిసిందే మరి.