ప్రస్తుతం ఐపీల్ కోసం భారత ఆటగాళ్లు సిద్ధమయ్యారు ఏప్రిల్ 7 న కాబోతున్న ఐపీల్ అందర్నీ ఆకట్టుకున్నదనే చెప్పాలి వేసవి లో ఇదొక ఎంటర్ టైనర్ ఐపీల్ ముగిసిన వెంటనే మరో సిరీస్ కి భారత్ సిద్ధం కానుంది.ఇటీవల ముగిసిన దక్షిణాఫ్రికా పర్యటనలో టెస్ట్ సిరీస్ చేయిజార్చుకున్న సంగతి తెలిసిందే తరువాత పుంజుకొని వన్డే ,T20 ,సిరీస్ గెలిచినా సంగతి తెలిసిందే .ఎంతో కాలం నుంచి ఊరిస్తున్న ఇంగ్లాండ్ సిరీస్ కి రంగం సిద్ధం అయింది.2007 లో జరిగిన 3 మ్యాచ్ ల టెస్ట్ సిరీస్ లో 1 - 0 తో భారత్ గెలుపొందింది.అప్పటి నుంచి ఒక్క సిరీస్ కూడా ఇంగ్లాండ్ గడ్డపై గెలవని భారత్ 2011 లో 4 టెస్ట్ మ్యాచ్ లో 4 - 0
చేయిజార్చుకుంది
2014 లో ను ఇదే సీన్ రిపీట్ అయింది 5 టెస్ట్ మ్యాచ్ సిరీస్ లో 3 - 1 ఓడిపోయిన భారత్ ఈ రెండు సిరీస్ లకి ధోని కెప్టెన్ గ వ్యవహరించాడు .సర్వత్రా విమర్శలు ఎదురు కున్న ధోని కెప్టెన్ బాధ్యత నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడం తరువాత కోహ్లీ కెప్టెన్ అవ్వడం చక చక జరిగాయి. కానీ ఇంగ్లాండ్ గడ్డ మీద మాత్రం కోహ్లికి పేలవ రికార్డ్ ఉంది. 2014 పర్యటనలో కోహ్లి ఐదు టెస్టుల్లో కలిపి 13.40 యావరేజ్‌తో 134 రన్స్ మాత్రమే చేయలిగాడు. వరుసగా 1, 8, 25, 0, 39, 28, 0,7, 6, 20 చొప్పున మాత్రమే అతడు పరుగులు రాబట్టాడు.దక్షిణాఫ్రికా సిరీస్ లో వీరంగం చేసిన కోహ్లీ ఇంగ్లాడ్ సిరీస్ లో రాణిస్తుంటాడని మాజీ ఆటగాళ్లు ప్రశంసలే కురిపించేసారు .దీంతో మురిసిపోకుండా ధోని సాధించనది ఎలాగయినా సాధించాలని పట్టుదలతో ఉన్నాడు అనుకున్నదే తరువుగా ఇంగ్లాండ్ కౌంటీ మ్యాచ్ లకు సిద్ధమవుతున్నాడు అక్కడి పరిస్థితులకి అలవాటు పడాలనిదే కోహ్లీ ఆలోచన .ఓపెనర్ శిఖర్ ధావన్ కూడా ఇంగ్లాండ్ పర్యటన పై ధీమా వ్యక్తం చేస్తున్నాడు.దక్షిణాఫ్రికా సిరీస్ ముందు ప్రాక్టీస్ లేక ఓడిపోయాం అదే పొరపాటు ఇంగ్లాండ్ మీద జరగనీయమని అందుకే ముందుగానే ఐపీల్ ముగిసిన వెంటనే ఇంగ్లాండ్ వెళ్లి ప్రాక్టీస్ మ్యాచ్ లు ఆడదానికి భారత్ సిద్ధమవటం చూస్తుంటే గత 11 సమత్సరాల గ జరగని కల కోహ్లీ నెరవేస్తాడో లేదో చూడాలి .
జులై 3న ప్రారంభంకానున్న ఈ సుదీర్ఘ సిరీస్‌లో మొదట మూడు టీ20లు, ఆ తర్వాత మూడు వన్డేలు, చివర్లో ఐదు టెస్టులు జరగనున్నాయి. చూడాలి ధోని అనుకున్నది కోహ్లీ సాధిస్తాడా లేదో