//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

10 గ్రామాలకు ఆ ఏనుగు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది

Category : national

ఒక ఏనుగు పది గ్రామాలకు కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది. తమిళనాడులోని వేలూరు సమీపంలో ఉన్న వాణియంబాడి సమీపంలో ఒంటరి ఏనుగు సంచరిస్తూ పంట పొలాలను ధ్వంసం చేస్తుండడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వాణియంబాడి సమీపంలో ఆలంగాయం, నాయకనూరు, భీమకులం, జమునాముదూరు, కావలూ, మలైరెడ్డియార్‌, నరసింగపురం తదితర కొండ గ్రామాలున్నాయి. వారం రోజుల క్రితం అడవి నుంచి వచ్చిన ఓ ఏనుగు పంట పొలాల్లో చొరబడి ధ్వంసం చేస్తోంది.

ప్రజలు బాణసంచా ఉపయోగించి దానిని అడవిలోకి తరిమినా మళ్లీ ఈ ప్రాంతంలోకి ప్రవేశిస్తోంది. కొన్ని సార్లు జవావాసాల్లోకి ఏనుగు ప్రవేశిస్తుండడంతో దానిని మళ్లీ అడవిలోకి తరలించాలని ఆ గ్రామాల ప్రజలు ఆలంగాయం అటవీ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో, పాఠశాలలు ప్రారంభం కావడంతో ఒక గ్రామ విద్యార్థులు పాఠశాలకు వెళ్లాలంటే సుమారు 2,3 కి.మీ దూరంలో ఉన్న మరో గ్రామానికి వెళ్లాల్సి ఉంది. ఏనుగు భయంతో తల్లిదండ్రులు పిల్లలను బడికి పంపాలంటే జంకుతున్నారు. అయితే ఈ విషయంలో అధికారులు కూడా చేతులు ఎత్తేసినట్టు తెలుస్తుంది.

Related News