//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

హిమాచల్‌ప్రదేశ్‌లో నేడు ఎన్నికలు

Category : national

68 అసెంబ్లీ నియోజకవర్గాలకు గురువారం పోలింగ్‌ జరగనుంది. వరుస విజయాలతో ఊపు మీదున్న బీజేపీ.. అధికార కాంగ్రెస్‌ పార్టీని గద్దె దించాలని తీవ్రంగా కృషి చేస్తోంది. అదే సమయంలో మొన్ననే పంజాబ్‌లో జరిగిన ఉప ఎన్నికలలో బీజేపీ సిట్టింగ్‌ సీటును దక్కించుకున్న కాంగ్రెస్‌ పార్టీ ఆ ఊపును కొనసాగించాలని ప్రయత్నిస్తోంది. ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్‌ అమిత్‌ షాలు ఈ చిన్న రాష్ట్రంలో ఏడు ర్యాలీలలో పాల్గొని ఎన్నికల ప్రచారం చేశారు. కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మూడు సభలలో పాల్గొని ఊపు తీసుకువచ్చారు. ఇక, ఈ రోజు జరగనున్న పోలింగ్‌కు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లూ చేసింది. 983 పోలింగ్‌ కేంద్రాలను సమస్యాత్మక మైనవిగా, 399 కేంద్రాలను అత్యంత సమస్యాత్మకమైనవిగా గుర్తించి పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఉదయం 8గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకూ పోలింగ్‌ నిర్వహిస్తామని ఈసీ అధికారులు తెలిపారు.