Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఎలక్షన్ ఎక్స్ క్లూజివ్ రిజల్ట్స్ .. కృష్ణా జిల్లా అస‌లు సిస‌లైన గ్రౌండ్ రిపోర్ట్ ..!

Category : state politics

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో సార్వ‌త్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన ఫ‌లితాల‌పై ప్ర‌జ‌ల్లో తీవ్ర స్థాయి ఉత్కంఠ నెల‌కొన్న సంగ‌తి తెలిసిందే. ఓట‌ర్లు ఏ పార్టీని ఆద‌రించారు..? ఎవ‌రిని ముఖ్య‌మంత్రి చేయ‌నున్నారు..? అన్న ప్ర‌శ్న‌ల‌పై రాజ‌కీయ విశ్లేష‌కులు సైతం స‌మాధానం చెప్ప‌లేని ప‌రిస్థితి ఏపీ రాజ‌కీయాల్లో నెల‌కొని ఉంది.

అయితే, ఏపీ ఎన్నిక‌ల‌కు సంబంధించి ప్ర‌జ‌ల్లో నెల‌కొన్న ఉత్కంఠ‌త‌ను గ‌మ‌నించిన కొన్ని ప్ర‌ముఖ సంస్థ‌ల‌కు చెందిన స‌ర్వే ఏజెన్సీలు పోలింగ్‌కు ముందు.., పోలింగ్ త‌రువాత ప్ర‌జ‌ల నాడి ఎలా ఉంది..? అన్న ప్రశ్న‌ల‌పై ఆరా తీసిన సంగ‌తి తెలిసిందే. అలా ప్ర‌ముఖ సంస్థ‌లు నిర్వ‌హించిన స‌ర్వేలు ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారాయి.కాగా, కృష్ణా శ్రీ‌కాకుళం జిల్లాలో ఉన్న మొత్తం 16 అసెంబ్లీ స్థానాల్లో, 2014 సాధార‌ణ ఎన్నిక‌ల్లో తెలుగుదేశం – 11, వైఎస్ఆర్ కాంగ్రెస్ – 4, బీజేపీ – 1 సీట్ల‌ను గెలుపొందిన సంగ‌తి తెలిసిందే. కానీ, ఈ సారి ఆ ప‌రిస్థితి మారే అవ‌కాశాలు నూటికి నూరుశాతం ఉన్నాయ‌ని, ఆ విష‌యం వెల్ల‌డైందంటూ సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్ అవుతున్న స‌ర్వే లెక్క‌లు చెబుతున్నాయి. ఆ స‌ర్వే లెక్క‌ల ప్ర‌కారం కృష్ణా జిల్లాలోని 16 అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గాల‌కు సంబంధించిన వివ‌రాలు ఇలా ఉన్నాయి.

తిరువూరు : టీడీపీ
నూజివీడు : ఫిఫ్టీ – ఫిఫ్టీ ఛాన్స్ ( టీడీపీ లేదా వైసీపీ)
గ‌న్న‌వ‌రం : టీడీపీ
గుడివాడ : ఫిఫ్టీ – ఫిఫ్టీ ఛాన్స్ ( టీడీపీ లేదా వైసీపీ)
కైక‌లూరు : ఫిఫ్టీ – ఫిఫ్టీ ఛాన్స్ ( టీడీపీ లేదా వైసీపీ)
పెడ‌న : వైసీపీ
మ‌చిలీప‌ట్నం : ఫిఫ్టీ – ఫిఫ్టీ ఛాన్స్ ( టీడీపీ లేదా వైసీపీ)
అవ‌నిగ‌డ్డ : వైసీపీ
పామ‌ర్రు : వైసీపీ
పెన‌మ‌లూరు : టీడీపీ
విజ‌య‌వాడ వెస్ట్ : ఫిఫ్టీ – ఫిఫ్టీ ఛాన్స్ ( టీడీపీ లేదా వైసీపీ)
విజ‌య‌వాడ సెంట్ర‌ల్ : టీడీపీ
విజ‌య‌వాడ ఈస్ట్ : టీడీపీ
మైల‌వ‌రం : టీడీపీ
నందిగామ : టీడీపీ
జ‌గ్గ‌య్య‌పేట : టీడీపీకృష్ణా జిల్లాలోని మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య : 16
టీడీపీ : 8
వైసీపీ : 3
ట‌ఫ్ ఫైట్ : 5అయితే, 2014 ఎన్నిక‌ల ఫ‌లితాల‌ను ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న రాజ‌కీయ విశ్లేష‌కులు కృష్ణా జిల్లాలో ఈ ద‌ఫా వైసీపీ ప‌రిస్థితి కాస్త కిష్టంగా మారింద‌ని చెబుతున్నారు. అలాగే, కృష్ణాలోని 16 అసెంబ్లీ స్థానాల్లో టీడీపీ – 8, వైసీపీ – 3 స్థానాల‌ను క‌చ్చితంగా గెలుపొందుతాయ‌ని, ఆ స‌ర్వే పేర్కొంది. ఇక ట‌ఫ్ ఫైట్ అంటూ సూచించిన 5 స్థానాల్లో వైసీపీ, టీడీపీ మ‌ధ్య నువ్వా..? నేనా..? అన్న రీతిన పోటీ నెల‌కొంద‌ని, అందులో వైసీపీ ఎన్ని కైవ‌సం చేసుకుంటుందో..? టీడీపీ ఎన్ని గెలుపొందుతుందో..? అన్న‌ది తెలియాలంటే మే 23న వెలువ‌డ‌నున్న ఫ‌లితాలు వ‌చ్చే వ‌ర‌కు వేచిచూడ‌క త‌ప్ప‌ద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

Related News