Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఒక చోట ర‌క్తం సేక‌రిస్తే రోగం తెలుస్తుందంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసిన...ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ ...?

Category : state politics

గ‌త కొన్ని రోజుల నుండి దేశంలో జరిగిన ఎన్నిక‌ల‌లో ఈవీఎంలా ప‌నితీరు స‌రిగా లేదంటూ కేంద్ర ఎన్నిక‌ల సంఘం తీవ్ర విమ‌ర్శ‌లు ఎదుర్కోంటుంది.దీని పై కేంద్ర ఎల‌క్ష‌న్ క‌మిష‌న‌ర్ సునీల్ అరోరా మాట్లాడుతూ ......కొన్ని చోట్ల ఈవీఎంలు మొరాయిస్తే అన్ని చోట్ల ఇలాగే జ‌రిగింది అనుకోవ‌డం క‌రెక్ట్ కాద‌ని ,గ‌త ఎన్నిక‌ల‌లో ఒక ల‌క్ష 75 వేల ఈవీఎంల‌ను వాడితే అందులో 6 మాత్ర‌మే స‌రిగా ప‌నిచేయ‌లేద‌ని ,మీడీయా భాగున్న వాటిపైన పోక‌స్ చేయ‌కుండా ,ఈ ఆరిటి పైనే పోక‌స్ చేయ‌డం ఆలోచించాల్సిన విష‌యం అని సునీల్ అరోరా అన్నారు.

ఒక రోగి రోగం తెలుసుకోవాలంటే ఒక చోట ర‌క్తం తీసిన శ‌రీరంలో 20 భాగాల‌లో ర‌క్తం తీసిన ఒకే రిజ‌ల్ట్ వ‌స్తుంది త‌ప్ప వేరే రాద‌ని చెపుతూ ...45వేల ఈవీఎంలు అవ‌స‌రం ఉన్న చోట 90వేల ఈవీఎంలు పంపించామ‌ని తెలిపారు.45వేల ఈవీఎంల‌లో 45 ఈవీఎంలు ప‌నియ‌చేయ‌క పోతే వాట‌న్నిటిని లెక్కించమ‌ని చెప్ప‌డం స‌రికాద‌ని ,అభ్య‌ర్థి కోరుకుంటే చెప్పిన చోట వీవీ ప్యాట్ ల‌ను లెక్కిస్తామ‌ని ,అలాగ‌ని అన్ని చోట్ల లెక్కించ‌డం కుద‌ర‌ద‌ని చెప్పారు.

గ‌త ఎన్నిక‌ల‌లో 1500 వీవీ ప్యాట్ ల‌ను తెక్కిస్తే ఎలాంటి పొర‌పాటు జ‌ర‌గ‌లేద‌ని అన్ని చోట్ల క‌రెక్ట్ లెక్కా వ‌చ్చింద‌ని స‌నీల్ ఆరోరా పేర్కొన్నారు.ప్ర‌స్తుత ఎన్నిక‌ల‌లో 2600 కోట్లు డ‌బ్బులు ప‌ట్టుబ‌డ్డాయ‌ని దీని గురించి రాజ‌కీయ‌నాయ‌కులు ఒక సారి ఆలోచించాల‌ని ఆ మీడియా స‌మావేశంలో తెలిపారు.