Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సీనియర్ ఐపీఎస్ అధికారులపై బదిలీ వేటు: ఈసీ

Category : politics state

సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్నసమయంలో ఎన్నికల కమిషన్(ఈసీ) కీలక నిర్ణయం తీసుకుంది. పశ్చిమ బెంగాల్‌లోని నలుగురు సీనియర్ ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.

అంతేకాకుండా ఎన్నికల విధుల్లో పాల్గొనరాదంటూ వీరికి ఆదేశాలు జారీ చేసింది. బదిలీ చేసిన వారిలో కోల్‌కతా, బిధాన్నగర్ పోలీస్ కమిషనర్లు అనుజ్ శర్మ, గ్యాన్‌వంత్ సింగ్ ఉన్నారు. గతంలో సీబీఐకి వ్యతిరేకంగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ చేసిన ధర్నాలో అనుజ్ శర్మ పాల్గొన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను మోదీ ప్రభుత్వం స్వప్రయోజనాలకు ఉపయోగించుకుంటోందని విపక్షాలు ఆరోపిస్తున్ననేపథ్యంలో ఈ బదిలీలు జరగడం విశేషం.

Related News