//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఇక నుండి ఓటువేస్తే రసీదు

Category : national

ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యంత్రాలు (ఈవీఎం) పనితీరును నిరూపించేందుకు బహిరంగ పరీక్షకు ఎన్నికల సంఘం సిద్ధమైంది. ఈ మేరకు ఈవీఎంల పనితీరుపై కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) శనివారం నమూనా ప్రదర్శన నిర్వహించింది. ట్యాంపరింగ్‌కు అవకాశం లేదని నిరూపించేందుకు సీఈసీ శనివారం ఢిల్లీలో ఈ ప్రదర్శన చేపట్టింది. ఈ సందర్భంగా ఈవీఎంల వినియోగంతో పాటు, కాగితపు స్లిప్పులపై వివరాలు నమోదయ్యే పత్రాల గురించి ఎన్నికల ప్రధాన కమిషనర్‌ నసీం జైదీ మీడియాకు వెల్లడించారు. ఇప్పటివరకు ఈవీఎంలతో ఎన్నికలను విజయవంతంగా పూర్తిచేసినట్టు ఆయన గుర్తుచేశారు. ఈవీఎంల పనితీరుపై కొన్ని రాజకీయ పార్టీలకు సందేహాలు వచ్చాయని, వాటి పనితీరుపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించినట్టు ఆయన తెలిపారు. సీఈసీ ఎప్పటికప్పుడు సాంకేతికతను వినియోగించుకుంటూ ముందుకెళ్లొందన్నారు. అలాగే ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు సాంకేతికతపై ఆధారపడుతున్నట్టు వివరించారు. అత్యున్నత ప్రమాణాలు పాటించడమే తమ లక్ష్యమన్నారు. ఇకపై ఓటు రసీదు యంత్రాలతో కూడిన ఈవీఎంలను వినియోగించనున్నట్టు జైదీ స్పష్టంచేశారు.