//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

సోనియా ఫ్యామిలీకి ఈడీ షాక్ ... అల్లుడు రాబర్ట్ వాద్రా కార్యాలయాలపై దాడులు అందుకేనా

Category : politics state

దేశం ఇప్పుడు ఎన్నికల పై దృష్టి సారించింది. ఈ ఎన్నికలు భవిష్యత్ పార్లమెంట్ ఎన్నికలకు దిక్సూచి కావటంతో అందరి చూపు ఈ ఎన్నికల ఫలితాలపై ఉంది. ఇక కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని చాలా ప్రయత్నం చేస్తుంది. ఒక పక్క ఎన్నికల హడా విడిలో ఉంటె మరో పక్క ఈడీ దాడులు రాజకీయ వర్గాలను నిద్ర పోనివ్వటం లేదు. ఐదు రాష్ట్రాల ఎన్నికల పోలింగ్ ముగిసిన సమయంలోనే దేశ రాజధాని ఢిల్లీలో కలకలం రేగింది. కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా కార్యాలయం,వాద్రా ఉద్యోగుల ఇళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అకస్మాత్తుగా దాడి చేసింది.

ఒకేసారి తనిఖీ బృందాలు బెంగుళూరులోని వాద్రా వ్యాపార సహచరుల ఆస్తుల పై కూడా సోదాలు నిర్వహించాయి. రాజస్థాన్ లోని కొలాయత్ లో జరిగిన ఒక భూమి వ్యవహారం పై దర్యాప్తులో భాగంగా సోదాలు నిర్వహించారు. వాద్రాకి చెందిన స్కై లైట్ హాస్పిటాలిటీ లోని 69.55 హెక్టార్ల భూమిని రూ.72 లక్షలకు కొనుగోలు చేసింది. తర్వాత దానిని అలీజెనీ ఫిన్ లీస్ కు రూ.5.15 కోట్లకు అమ్మింది. మోసంతో రూ.4.43 కోట్ల లాభాన్ని ఆర్జించింది.వాద్రా తరఫు న్యాయవాది సుమన్ ఖైతాన్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు.

నియంతృత్వ ధోరణితో వ్యవహరించిన ఈడీ అధికారులు ఈ ఉదయం 9 గంటల సమయంలో ఉద్యోగులను తాళం వేసి బయటికి పోనీయకుండా వాద్రా ఆస్తుల పై దాడి చేసినట్టు ఆరోపించారు. ‘స్కైలైట్ హాస్పిటాలిటీ లోపల ఉద్యోగులను బంధించారు. వారిని ఎవరినీ కలవనీయకుండా నిర్బంధించారు. ఇది నాజీజిమా? ఇది జైలా?‘ అని ఆయన ప్రశ్నించారు. సుఖ్ దేవ్ విహార్ కార్యాలయం ఇద్దరు ఉద్యోగుల ఇళ్ల పై ఈడీ అధికారులు అక్రమంగా దాడి చేసినట్టు ఖైతాన్ తెలిపారు. ‘ఇది పూర్తిగా అక్రమం. చట్టప్రకారం కార్యాలయం తెరిచే వరకు వేచి చూడాల్సి ఉండగా వాళ్లు కనీసం అంత సమయం కూడా ఆగలేదు.

చట్టవిరుద్ధంగా తాళాలు బద్దలు కొట్టి కార్యాలయం లోపలికి ప్రవేశించారు. ఆఫీసు లోపల అన్ని క్యాబిన్ల తాళాలు బద్దలు కొట్టి తెరిచారు. ఆఫీసులో ఉదయం 8-9 గంటల నుంచి ఈడీ ఆఫీసర్లు ఉన్నారు. లాయర్లను కానీ, ప్రతినిధులను కానీ లోపలికి అనుమతించలేదని‘ చెప్పారు. ‘ఇప్పటికే నాలుగైదేళ్లు గడిచాయి. ఇప్పటి వరకు వారికేమీ దొరకలేదు. మమ్మల్ని బయట ఉంచి లోపల తప్పుడు సాక్ష్యాధారాలను ఉంచుతున్నారని‘ ఖైతాన్ ఆరోపించారు. ఈ వ్యవహారం గురించి తనకేమీ తెలియదని వాద్రా చెబుతున్నారు. మోడీ ప్రభుత్వం తనను తన సహచరులను వేధిస్తోందని ఆరోపిస్తున్నారు. మొత్తానికి సోనియా ఫ్యామిలీకి షాక్ ఇస్తూ అల్లుడి కార్యాలయాల్లో, ఇళ్ళల్లో ఈడీ దాడులు జరిగాయి.

Related News