//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

జగన్ భార్యపై చార్జ్ షీట్...!

Category : politics national

ఎన్ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ వేసిన ఓ చార్జిషీట్ వైసిపిలో సంచలనం రేపింది. విషయం ఏమిటంటే ఈడి వేసిన చార్జిషీట్ ఎవరిమీదో తెలుసా వైసీపీ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సతీమణి వైఎస్ భారతిపైనే. భారతి సిమెంట్స్ లో క్విడ్ ప్రోకో జరిగిందంటూ దాదాపు ఏడేళ్ల క్రితం సిబిఐ, ఇడి రెండు కలిసి కేసులు నయోదు చేసి దర్యాప్తు చేస్తున్నాయి.

ఈ కేసుకి సంబంధించి మొదటిసారిగా చార్జిఫీటు పడింది భారతిపై. విచిత్రమేమిటంటే, సిబిఐ ప్రత్యేక న్యాయస్ధానంలో విచారణ జరుపుతున్న ఈ కేసులో సిబిఐ మాత్రం ఎటువంటి అభియోగాలు నమోదు చేయకపోయినా ఈడి మాత్రం భారతిని వదలకుండా వుంది . ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే రాజ్యసభ డిప్యుటి ఛైర్మన్ ఎన్నిక ముగిసిన రోజే వైఎస్ భారతిపై ఇడి అభియోగ పత్రాలు నమోదు చేయటం సంచలనంగా మారింది.

రాజ్యసభ డిప్యుటి ఛైర్మన్ ఎన్నికను వైసిపి బహిష్కరించిన నేపధ్యంలో చార్జిషీటు వేయటం గమనార్హం. దీనితో పలువురు ఆశ్చర్యపోతున్నారు.ఈ విషయమై వైసిపి అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మాట్లాడుతూ, వైఎస్ భారతిపై ఏడేళ్ళ క్రిందటి కేసులో చార్జిషీటు వేయటం రాజకీయ దురుద్దేశ్యంతోనే జరిగిందంటూ మండిపడ్డారు. జగన్ ను ఏమీ చేయలేక వైఎస్ భారతిని ఇందులోకి లాగుతున్నారని పద్మ ధ్వజమెత్తారు.

Related News