//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

రూ799కే విస్తారా ఎకానమీ క్లాస్ టికెట్!

Category : business

మాన్‌సూన్ సేల్ ఆఫర్‌తో ప్రైవేట్ రంగ విమాన సంస్థలు పోటీలు పది మరీ ప్రయాణికులకు ప్రత్యేక ఆఫర్లు ఇస్తున్నాయి. తాజాగా  ‘రిటర్న్ ఆఫ్ ది గ్రేట్ మాన్‌సూన్ సేల్ ఆఫర్’ పేరుతో రూ.799 ప్రారంభ ధరతో టికెట్లను విక్రయిస్తున్నట్టు విస్తారా తెలిపింది. గురు, శుక్ర వారాలలో మాత్రమే ఈ   ఆఫర్ ఉంటుంది. ఆఫర్‌లో భాగంగా కొనుగోలు చేసిన టికెట్లతో జూలై 21 నుంచి సెప్టెంబరు 20 మధ్య ప్రయాణించవచ్చని పేర్కొంది.

‘మొదటి వచ్చిన వారికి మొదట’ విధానంపై టికెట్లను విక్రయించనున్నట్టు విస్తారా వివరించింది. ఈ ఆఫర్ కింద అన్ని చార్జీలు కలుపుకుని ఎకానమీ క్లాస్ ప్రయాణికులకు రూ.799కే టికెట్లను విక్రయించనుంది. జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన జీఎస్టీ కారణంగా ఎకానమీ క్లాస్ టికెట్లు చవక అయ్యాయి.

ఎకానమీ క్లాస్ ప్రయాణాన్ని జీఎస్టీలో 5 శాతం పన్ను పరిధిలోకి తెచ్చారు. గతంలో అది 6 శాతంగా ఉండేది. అయితే బిజినెస్ క్లాస్ ప్రయాణం మాత్రం మరింత భారం కానుంది. జీఎస్టీకి ముందు ఇది 9 శాతం పన్ను పరిధిలో ఉండగా ప్రస్తుతం దీనిని 12 శాతంగా నిర్ణయించారు.