//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

త్వరలో ఎకనమీ ఏసీ రైల్వే కోచ్‌లు

Category : business

సాధారణ ప్రయాణికులు సహితం రైల్వే లలో ఏసీ కోచ్ లలో ప్రయాణం చేయగల సదుపాయం కల్పించడం కోసం భారతీయ రైల్వేలు త్వరలో ఎకానమీ ఏసీ కోచ్‌లను ప్రవేశ పెట్టనున్నాయి. రైల్వేల ఆధునికరణలో భాగంగా తక్కువ చార్జీతోనే చాలామందికి ఏసీ కోచ్‌లో ప్రయాణించే అవకాశం కల్పించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న మూడురకాల ఏసీ-3, ఏసీ-2, ఏసీ-1 కోచ్‌లకు అదనంగా కొత్తరకం కోచ్  పెట్టనున్నారు. 

ఎకానమీ ఏసీ కోచ్‌ల్లో ప్రయాణించేవారికి ప్రత్యేకంగా దుప్పట్లు అవసరంలేదు. ఈ కోచ్‌ల్లో మరీ అంత వణుకుపుట్టించే ఏసీ చల్లదనం ఉండదు. ఇతర ఏసీ కోచ్‌లకు భిన్నంగా ఎకానమీ ఏసీ కోచ్‌ల్లో ఉష్ణోగ్రత 24-25 డిగ్రీలు ఉంటుంది. 3ఏసీ టారిఫ్‌ కన్నా తక్కువ చార్జీలనే దీనికి వసూలు చేయనున్నారు.

చాలా దూరం ప్రయాణించే రైళ్లలో ఏసీ కోచ్‌ల సంఖ్య ను క్రమంగా పెంచుకొంటూ వస్తున్న రైల్వేలు త్వరలో ఆటోమేటిక్ తలుపులతో కూడిన పూర్తి ఏసీ కోచ్ రైళ్లను ప్రవేశపెట్టనున్నాయి. ఇప్పుడు రాజధాని, శతాబ్ది, హమ్‌సఫర్, తేజస్ రైళ్లు మాత్రమే పూర్తి ఎయిర్ కండిషన్డ్ కోచ్‌లు కలిగినవి. అయితే వీటిలో బోగీలు తక్కువ. అందుకని ఎంపిక చేసిన రూట్లలో ముందుగా పూర్తి ఏసీ కోచ్ రైళ్లను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకొంటున్నారు.

మరోవంక రైల్వే సిబ్బందికి డిజైనర్ యూనిఫాంలు రూపొందించాలని యోచిస్తున్నారు. అక్టోబర్ నుంచి పండుగల సీజన్ నాటికి రైల్వే సిబ్బందికి స్పోర్టింగ్ డిజైనర్ జాకెట్లు, టీషర్టులతో కూడిన యూనిఫారాలు ఇవ్వాలని రైల్వేశాఖ సన్నాహాలు చేస్తున్నది. అయితే ఈ యూనిఫారాలు అందరికీ ఇవ్వరు. రైల్లో విధులు నిర్వహించే టీటీఈ, గార్డులు, డ్రైవర్లు, క్యాటరింగ్ సిబ్బందికి, స్టేషన్ మాస్టర్లు తదితరులకు మాత్రమే ఇస్తారు. ఫ్యాషన్ డిజైనర్ రితూ బేరీతో ఈ కొత్త తరహా యూనిఫారాలను రూపొందిస్తున్నారు.