Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఏపీలో అలీ బాబా: ఎంఓయూ కుదుర్చుకున్న ప్రభుత్వం...

Category : world politics

ఆంధ్రప్రదేశ్ అబివృద్ది కోసం అహర్నిశలు కష్టపడుతున్న ముఖ్య మంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రంలో పెట్టుబడుల కోసం అనేక సంస్థలు తిరుగుతున్నాడు. ఇప్పడు పలు సంస్థలు, పారిశ్రామికవేత్తలు తమ కార్యకలాపాలను ఏపీలో నిర్వహించేందుకు పోటీపడుతున్నారు. తాజాగా, ప్రపంచ ఈకామర్స్ దిగ్గజం 'అలీబాబా' కూడా ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు మొగ్గు చూపింది.

ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసంలో అలీబాబా సంస్థ ప్రతినిధులు చంద్రబాబును కలిశారు.రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమంత్రి చంద్రబాబు తో చర్చించారు. ఈ సందర్భంగా అలీబాబా క్లౌడ్ లిమిటెడ్ వివిధ రంగాల్లో ప్రభుత్వంతో కలసి పని చేసేందుకు ఎంవోయూ కదుర్చుకుంది. ఈ సంస్థ అలీబాబా గ్రూపులో ఓ విభాగం. దీనివలన మరికొంత మందికి ఉపాధి కలుగుతున్నదని నాయకులూ అంటున్నారు.

Related News