//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వ్యక్తిగత విమర్శలపై ఆ నలుగురికీ ఈసీ నోటీసులు ... మరి కేసీఆర్ మాటేంటి

Category : politics

తెలంగాణలో ముందస్తు ఎన్నికల వేళ వ్యక్తి గత దూషణలకు దిగిన నాయకులపై ఈసీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. ఎన్నికల నియమావళి అమలులో ఉన్న నేపధ్యంలో మాట్లాడే భాష కూడా పద్దతిగా ఉండాలని అనుచిత వ్యాఖ్యల జోలికి పోవద్దని ఈసీ ఆదేశాలిచ్చింది. అయినా సరే ఎలా పడితే అలా మాట్లాడి తిట్టిపోసి సవాల్ లు విసురుకుని రచ్చ చేస్తున్న నాయకులకు ఈసి నోటీసులు జారీ చేసింది. కానీ ఆ పంధా ముందు చంద్రబాబుని తిట్టి ఆరంభించిన కేసీఆర్ కు వర్తించదా అన్నది ఇప్పుడు రాజకీయ వర్గాల ప్రశ్న.EC issued notices for Telangana leaders no comments from KCR

ఎన్నికల సభల్లో ప్రత్యర్థులపై పరుష పదజాలంతో తీవ్రమైన విమర్శలు చేసిన టీడీపీ, కాంగ్రెస్, టీఆర్ఎస్‌ నేతలకు ఈసీ షాకిచ్చింది. 48 గంటల్లోపుగా వివరణ ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. మంత్రి హరీష్‌రావుతో పాటు రేవంత్ రెడ్డి, రేవూరి ప్రకాష్‌రెడ్డిలకు కూడ ఈసీ నోటీసులను జారీ చేసింది.EC issued notices for Telangana leaders no comments from KCR

ఏపీ సీఎం చంద్రబాబుపై తెలంగాణ భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు అనుచిత వ్యాఖ్యలు చేశారని టీడీపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై 48 గంటల్లోపుగా వివరణ ఇవ్వాలని ఈసీ శుక్రవారం ఆదేశాలు జారీ చేసింది.EC issued notices for Telangana leaders no comments from KCR

మరోవైపు కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి, ఆ పార్టీ నేత ఒంటేరు ప్రతాప్ రెడ్డి, టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు రేవూరి ప్రకాష్‌ రెడ్డి‌లకు ఈసీ నోటీసులు ఇచ్చింది.టీఆర్ఎస్‌ నేతలతో పాటు కేసీఆర్‌ను తీవ్రమైన పదజాలంతో దూషించినందుకు ఈసీ నోటీసులు జారీ చేసింది. 48 గంటల్లో ఈ నోటీసులకు వివరణ ఇవ్వాలని ఈసీ స్పష్టం చేసింది. మొత్తానికి ఇందరి మీద కొరడా ఝుళిపిస్తున్న ఈసీ బహిరంగ సభల్లో చంద్రబాబుని అత్యంత హేయంగా దూషించిన కేసీఆర్ కు ఎందుకు నోటీసులు ఇవ్వలేదో అన్న చర్చ ఇప్పుడు రాజకీయ వర్గాల్లో సాగుతుంది.EC issued notices for Telangana leaders no comments from KCR

Related News