//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మ‌ధ్య‌ప్ర‌దేశ్ మంత్రిపై ఈసీ అనర్హత వేటు

Category : national

మరో సంవత్సరంలో ఎన్నికలు జరుగనున్న మధ్యప్రదేశ్ రాష్ట్రంలో బీజేపీ కి ఎన్నికల కమీషన్ షాక్ ఇచ్చింది. శివరాజ్ సింగ్ చౌహన్ మంత్రివర్గ సభ్యుడు నరోత్తమ్‌ మిశ్రా తన ఎన్నికల వ్యయం సరిగ్గా చూపలేదని నిర్ధారిస్తూ ఆయనపై అనర్హత వేటు వేసింది. ఈ రోజు నుండి మూడేళ్లపాటు ఆయన ఏ ఎన్నికల్లో పోటీచేయకుండా, ఏ పదవిలో ఉండకుండా భారీ ఝలకే ఇచ్చింది. 

ముఖ్యమంత్రి చౌహన్ కు సన్నిహితుడిగా భావించే మిశ్రాపై ఎన్నికల కమీషన్ వేటు ఆయనకు వ్యక్తిగతంగా  ఎదురు దెబ్బె అని పలువురు భావిస్తున్నారు. చెల్లింపు వార్తలకు చేసిన వ్యయాన్ని 2008 ఎన్నికల సమయంలో ఆయన సమర్పించిన అఫిడవిట్‌లో సమర్పించలేదని తేలడంతో తాజాగా ఈ వేటు వేసింది. 

మిశ్రా పలు అవినీతి చర్యలకు పాల్పడ్డాడని, ఎన్నికల సమయంలో తన ఖర్చును వెల్లడించే విషయంలో పారదర్శకతను ప్రదర్శించలేదంటూ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే రాజేంద్ర బారతీ 2009లో ఏప్రిల్‌ నెలలో ఈసీకి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఈసీ 2013 జనవరిలో స్పందన తెలియజేయాలంటూ మిశ్రాకు నోటీసులు పంపించింది. దీంతో మిశ్రా హైకోర్టుకు వెళ్లాడు.

కొద్ది రోజులపాటు దానిపై స్టే తెచ్చుకున్నా చివరకు స్టేను హైకోర్టు ఎత్తేయగా సుప్రీంకోర్టుకు వెళ్లారు. అయితే, సుప్రీంకోర్టులో ఆయనకు చుక్కెదురైంది. గత ఏడాది మిశ్రాను విచారించిన ప్యానెల్‌ చివరకు ఆయన తప్పు చేసినట్లు గుర్తించి మిశ్రాపై వేటు వేసింది.ఎన్నికల కమీషన్ ఉత్తరువుతో వెంటనే మిశ్ర మంత్రివర్గం నుండి రాజీనామా చేయాలని రాష్ట్ర అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడు అజయ్ సింగ్ డిమాండ్ చేశారు. అయితే మిశ్ర మాత్రం హై కోర్ట్ కు వెళ్లే ఉద్దేశ్యంలో ఉన్నట్లు తెలుస్తున్నది.