//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈసీ కీలక నిర్ణయం !

Category : politics

భారత ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

అదేమిటంటే వోటింగ్ ప్రక్రియలో జరుగుతున్న అవకతవకలకు చెక్ పెట్టే దిశగా ఓటరు ఐడీ కార్డులతో ఆధార్ అనుసంధానాన్ని తప్పనిసరి చేయాలని కోరుతూ ఈసీ సుప్రీంకోర్టులో రివైజ్డ్ పిటిషన్ ఫైల్ చేసినట్లు సమాచారం. ఈ ఓటరు కార్డు-ఆధార్ అనుసంధానం వల్ల ఒక్క వ్యక్తి ఒక్క ఓటును మాత్రమే పొందేలా చేయవచ్చని ఈసీ భావిస్తున్నట్లు ప్రముఖ ఆంగ్ల పత్రిక తెలిపింది.

మునుపు 12 అంకెల ఆధార్ నెంబరును ఓటరు కార్డులకు అనుసంధానం చేయడం స్వచ్ఛందమేనని ఈసీ పేర్కొన్న సంగతి తెలిసిందే. కానీ, 2016లో ఏకే జ్యోతి ప్రధాన ఎన్నికల అధికారిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈసీ తన వైఖరిని మార్చుకుంది. ఇప్పటివరకు 32 కోట్ల మంది ఆధార్‌ నెంబర్లను ఓటరు ఐడీ కార్డులతో అనుసంధానం చేశామని ప్రస్తుత ప్రధాన ఎన్నికల అధికారి ఓపీ రావత్ తెలిపారు.

ఓటరు కార్డులతో తప్పనిసరిగా ఆధార్ నెంబరును అనుసంధానం చేయాలని ఈసీ చెబుతున్నప్పటికీ, ఆధార్ కార్డును ఎన్నికల ఫొటో గుర్తింపు కార్డుగా మాత్రం పరిగణించేందుకు సుముఖంగా లేనట్లు తెలిసింది. కాగా, ఆధార్‌కున్న రాజ్యాంగబద్ధమైన చెల్లుబాటును సవాలు చేస్తూ దాఖలైన పలు పిటిషన్లు సుప్రీంకోర్టులో ప్రస్తుతం విచారణ జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆధార్ అనుసంధానంపై కోర్టు ఇచ్చే తుది తీర్పు కీలకం కానుంది.