//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మహరాష్ట్రలో భూకంపం...!

Category : national

మహారాష్ట్రలోని సత్తారా పట్టణ సమీపంలో ఈ ఉదయం భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేలుపై 3.4 తీవ్రతతో కూడిన ప్రకంపనలు నమోదైనట్టు భారత భూభౌతిక శాస్త్ర విభాగం వెల్లడించింది.

ఉపరితలానికి సుమారు 10 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. 3.4 తీవ్రతతో వచ్చే భూకంపాలు ఎటువంటి హానీ కలిగించబోవని అన్నారు. తొలి ప్రకంపన ఉదయం 7.11 గంటల సమయంలో నమోదైందని, ఆపై మరికొన్ని స్వల్ప ప్రకంపనలు వచ్చాయని అన్నారు.

భూకంపం వస్తోందని ప్రజలు ఇళ్లలోంచీ వీధుల్లోకి పరుగులు పెట్టారు. భూకంప నష్టంపై వివరాలు అందాల్సి వుంది. కాగా, జనవరి 31న ఆఫ్గనిస్థాన్ కేంద్రంగా 6.2 తీవ్రతతో భూకంపం రాగా, దాని ప్రభావం ఉత్తరాది వరకూ కనిపించిన సంగతి తెలిసిందే.