//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఢిల్లీ లో భూకంపం !

Category : national

దేశ రాజధాని ఢిల్లీని భూప్రకంపనలు వణికించాయి. భయకంపితులైన ప్రజలు ఇళ్లు, కార్యాలయాలు, షాపుల నుంచి బయటకు పరుగులు పెట్టారు.

ఆప్ఘనిస్థాన్ లోని హిందూకుష్ ప్రాంతంలో 190 కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉందని యూఎస్ జియొలాజికల్ సర్వే తెలిపింది. దీని తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా ఉంది. కొన్ని సెకన్ల పాటు భూమి కంపించింది.

జమ్ముకశ్మీర్ లో కూడా ప్రకంపనల తీవ్రత భారీగానే ఉంది. శ్రీనగర్ లో ప్రకంపనల కారణంగా పిల్లర్లపై నుంచి నిర్మాణంలో ఉన్న ఫ్లైఓవర్ పక్కకు ఒరిగిపోయింది.మరోవైపు, పంజాబ్, హిమాచల్ ప్రదేశ్, హర్యానాలలో కూడా భూమి కంపించినట్టు సమాచారం.