ఏపీలో కూడా ముందస్తు ఎన్నికలంటూ ప్రతిపక్ష నేత జగన్ చేసిన వ్యాఖ్యలతో అక్కడి రాజకీయాలు ఊపందుకున్నాయి. జనవరిలోనే ఎన్నికలు వచ్చే సూచనలు ఉన్నాయని, అందుకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని విశాఖలో నిన్న జరిగిన పార్టీ విస్తృతస్థాయి సమావేశంలో ప్రతిపక్ష నేత జగన్ అన్నారు. అందుకు తగ్గట్టు ప్రజలలోకి వెళ్లి చంద్రబాబు వైపల్యాలని ఎత్తి చూపాలని పార్టీ నేతలకి దిశానిర్దేశం చేసారు.
జగన్ ఓ వైపు పాదయాత్ర కొనసాగిస్తూనే నియోజకవర్గాలవారీగా ప్రచార కార్యక్రమాలు చేపట్టుటకు కార్యచరణను రెడీ చేసుకున్నారు. ఈ నెల 17 నుంచి ప్రచారాన్ని ముమ్మరం చేయాలని నిర్ణయించిన వైసీపీ..ప్రతి ముప్పై, ముప్పై ఐదు కుటుంబాలకు బూత్ కమిటీ సభ్యుడ్ని నియమించనుంది. ప్రతి నియోజకవర్గం సమన్వయ కర్త..ప్రతి రోజు రెండు బూత్‌లలో గడపగడపకు వెళ్లి ప్రచారం చేసేలా ప్లాన్ చేసుకుంది. వారంలో ఖచ్చితంగా ఐదు రోజుల పాటు బూత్ కుటుంబాలతో మమేకం కావాలని పార్టీ శ్రేణులకు జగన్ దిశా నిర్దేశం చేశారు. అలాగే ఓటర్ల సవరణపై దృష్టి సారించాలని సూచించినట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు.
అయితే జగన్ చేసిన వ్యాఖ్యలను కొట్టి పారేస్తున్నారు టీడీపీ నేతలు మరియు ప్రజలు. ప్రజల సమస్యలపై పోరాటం చేయలేని వాడు అసెంబ్లీ సమావేశాలకు డుమ్మాకొట్టి పైగా సీఎం చేస్తేనే మీ సమస్యలు తీరుస్తా అంటూ జగన్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. దీనితో ఇప్పుడు జగన్ ప్రజలు సమస్యల గురించి మాట్లాడుతుంటే నవ్వుస్తుందని సోషల్ మీడియాలో జోకులు వేసుకుంటున్నారు నెటిజన్లు.