//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తెలంగాణ జిల్లాల్లో ఇక ఈ-రిక్షా .!

Category : business

పర్మిట్‌ అవసరం లేదు.. ప్రత్యేక లైసెన్స్‌ పొంది ఉండాలి అంతే ఆరు సంస్థలకు డీలర్‌షిప్‌ అనుమతులిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం. రవాణా శాఖ రాష్ట్ర రహదారులపైకి త్వరలో ఈ-రిక్షాలను ప్రవేశ పెట్టనున్నారు. ఈ ఎలక్ట్రానిక్‌ వాహనాలు రోడ్లపైకి వచ్చేందుకు దాదాపు రంగం సిద్ధమైంది. ఈ-రిక్షాలకు అధీకృత డీలర్లుగా ఆరు సంస్థలకు రవాణా శాఖ అనుమతిచ్చింది. వీటిలో రెండు స్థానిక సంస్థలు కాగా, మిగతావి వేరే ప్రాంతాలకు చెందినవి. దేశ రాజధాని ఢిల్లీ సహా పలు నగరాల్లో ఇప్పటికే ఈ-రిక్షాలు ప్రాచుర్యంలో ఉన్న విషయం తెలిసిందే.