//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశంలో ఈ-కామర్స్ రూ 2 లక్షల కోట్ల పైమాటే

Category : business

దేశవ్యాప్తంగా రంగం శరవేగంగా దూసుకుపోతున్న  ఈ-కామర్స్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి 3300 కోట్ల డాలర్లకు చేరుకోనున్నదని పార్లమెంట్‌కు కేంద్రం తెలిపింది. ప్రస్తుత మారకం రేటు ప్రకారం మన కరెన్సీలో రూ.2 లక్షల కోట్లకు పైమాటే. గడిచిన ఆర్థిక సంవత్సరంలో నమోదైన ఈ-కామర్స్ మార్కెట్‌తో పోలిస్తే 19 శాతం ఎగబాకనున్నదని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ సహాయ మంత్రి సీఆర్ చౌదరి రాజ్యసభకు లిఖిత పూర్వకంగా సమాధానమిచ్చారు. 

ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ అంచనాను ఆయన ఉదాహరణగా చూపించారు. ఈ-కామర్స్ రంగంపై వినియోగదారుల నుంచి 28,770 ఫిర్యాదులు వచ్చాయన్నారు. వీటిలో 11,596 ఫిర్యాదులు డబ్బు వాపసుకు సంబంధించినవి కావా, మిగతావి ఉత్పత్తుల డెలివరీకి సంబంధించినవని తెలిపారు. ఫిర్యాదులపై ఆయా సంస్థలు పట్టించుకోని యెడల కన్జ్యూమర్ ఫోరమ్‌ను సంప్రదించాలని ఆయన సూచించారు.