Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

అమ్మాయితో సహజీవనం తప్పా..?: అథ్లెట్ ద్యుతి చంద్

Category : national

ప్రస్తుత సమాజంలో విది వైపరీత్యాలకు బదులు.... వింత వైపరీత్యాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రకృతి సిద్ధమైన పనులకు బదులు పనికిరాని పనులకు మనిషి మనసు లోబడి పోతు ఉండడం విచారం.ఈ మద్య కాలంలో కొంత మంది కామంతో కళ్ళు మూసుకుపోయి ఏం చేస్తున్నారో కూడా అర్థం కావడం లేదు. ఇందుకు కేవలం అనగరి కత అనడానికి వీలు లేదు.ఎందుకంటే కేవలం చదువు రాని వారు మాత్రమే కాదు చదువుకుని ఉన్నత స్థితిలో ఉన్న వారి నుంచి..... గొప్ప స్థాయిలో దేశానికి వన్నె తీసుకు రావాల్సిన వ్యక్తుల వరకు ఇదే పాడు బుద్ది తో ప్రవర్తిస్తున్నారు.దాన్ని ప్రేమ అంటారో..లేక పిచ్చి లేదా వెర్రి అంటారో కూడా అర్థం కాని పరిస్థితి. ఈ విషయంలో ఎక్కువగా మగవారు మగవారితో..ఆడవారు ఆడవారితో సంభోగానికి ప్రేరేపితులు కావడం గమనార్హం. తాజాగా తాను ఓ అమ్మాయితో రిలేషన్ లో ఉన్నానని... ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని ఓ మహిళా క్రీడాకారిణి ద్యుతి చంద్ చెప్పుకు రావడం సర్వత్రా చర్చనీయాంశం అయ్యింది.

అదేంటీ ఓ దేశానికి వన్నె తీసుకు రావల్సిన క్రీడాకారిణి అయి ఉండి..ఇలాంటి మాటలు మాట్లాడటం...అందులోనూ ఇలాంటి విషయంలో బహిరంగ స్టేట్ మెంట్ ఇవ్వడం ఏంటీ అని నెటిజన్లు, క్రీడాకారులు ఆశ్చర్యపోతున్నారు. అయితే తాను స్వలింగ సంపర్కురాలినని, ఓ అమ్మాయితో మూడేళ్లుగా అనుబంధంలో ఉన్నానని ఆమె చెప్పింది. తన గ్రామానికే చెందిన ఆ అమ్మాయిని పెళ్లి కూడా చేసుకోనున్నట్లు ఆమె వెల్లడించింది. తమ ఇద్దరి మనసులు కలిశాయని, జీవితాంతం కలిసుంటామని.. ఈ ఏడాది ప్రపంచ అథ్లెటిక్స్‌ అనంతరం పెళ్లి కూడా చేసుకుంటామని ఆమె చెప్పింది.ఈ విషయంలో ఆమె స్వరాష్ట్రం ఒడిషా నుండే ఎక్కువ మంది ఆమె వ్యవహారం శైలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తు ఉండడం గమనార్హం.ఇదే విషయంలో తాజాగా ద్యుతి తల్లి కూడా కూతురిపై వ్యవహార శలిపై తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యింది.

ఆమె ఓ క్రీడాకారిణి అయి ఉండి..నీచమైన ఇలాంటి పని చేస్తుందని తాను అనుకోలేదని. తన మేనకోడలి కూతురితోనే ద్యుతి ఇలాంటి అక్రమ సంబంధం పెట్టుకుందని . వయసులో వున్న ఆమెకు ఏవో మాయమాటలు చెప్పి లోబర్చుకున్నట్లుంది. నాకు మనవరాలు అవుతుందంటే ద్యుతికి కూతురు వరస. కూతురు సంబంధం ఉన్న ఆమెతో ద్యుతి సహజీవనం అంటుంటే..చుట్టు పక్కల వారు పక్కున నవ్వుతున్నారని....ఆమె తీవ్ర స్థాయిలో వ్యక్తం చేస్తూ ఓక్కింత ఆవేదనకు గురవుతుంది. కూతురు వరుస అయ్యే అమ్మాయితో వావివరసలు మరిచి అనైతిక చర్యలకు పాల్పడుతూ నా కూతురు ఇంతలా బరితెగించిందంటే నమ్మ బుద్ది కావడం లేదంటూ ఆమె చెప్పుకొచ్చింది. ఇప్పుడెమో తననే పెళ్లిచేసుకుంటానంటోందని... ఆ ప్రకృతి విరుద్దమైన పనికి తాము సహకరించబోం అంటూ ద్యుతి తల్లి అఖోజీ చంద్‌ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తన ఆటతో దేశ గౌరవాన్ని, తల్లిదండ్రుల పరువును మరింత పెంచాల్సిన ద్యుతి అసహజమైన పనులతో వార్తల్లో నిలవడం చాలా దురదృష్టకరమని ఆమె తన ఆవేదన వ్యక్తం చేసింది.

Related News