//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

దేశీయ మార్కెట్లోకి డుకాటీ సూపర్‌బైకులు

Category : business

ఇటలీకి చెందిన సూపర్‌బైకుల తయారీ సంస్థ డుకాటీ.. దేశీయ మార్కెట్లోకి మరో రెండు స్పోర్ట్ బైకులను ప్రవేశపెట్టింది. వీటిలో రూ.7.77 లక్షల విలువైన మాన్‌స్టర్ 797, రూ.12.6 లక్షల ధర కలిగిన ముల్టిస్ట్రాడా 950 మోడల్స్ ఉన్నాయి. ఈ ధరలు ఢిల్లీ షోరూంకు సంబంధించినవి. ప్రస్తుత సంవత్సరంలో దేశీయ మార్కెట్లోకి ఐదు బైకులను విడుదల చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న సంస్థ.. వీటిలో ప్రస్తుతం ఈ రెండింటిని అందుబాటులోకి తీసుకొచ్చింది. దేశీయంగా డుకాటీ బైకులకు డిమాండ్ నెలకొనడంతో నూతన శ్రేణి మోడళ్లను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు డుకాటీ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ రవి అవలూర్ తెలిపారు.

యూరో-4 ప్రమాణాలతో రూపొందించిన ఎయిర్ కూల్ 803 సీసీ ఇంజిన్‌తో తయారైన మాన్‌స్టర్ 797 బైకులో ఎల్‌ఈడీ లైట్లు, ఎల్‌సీడీ స్క్రీన్ వంటి ఫీచర్స్ ఉన్నాయి. 937 సీసీ ఇంజిన్‌తో తయారైన ముల్టిస్ట్రాడా 950ను 113 హెచ్‌పీతో రూపొందించింది. భద్రత ప్రమాణాలను మెరుగుపరుచడానికి ఈ రెండు బైకులలో బ్రేకింగ్ సిస్టాన్ని, ఏబీఎస్, ట్రాక్షన్ కంట్రోల్‌ను ఏర్పాటు చేసింది. నేడు విడుదల చేసినప్పటికీ వచ్చే నెల నుంచి ఈ బైకులు అందుబాటులోకి రానున్నాయని ఆయన వెల్లడించారు.