//single page style gallary page

Dual Roles

Category : movies

Click here to read this article in Telugu

ఎంట్రీలోనే డ్యూయల్ రోల్స్?

కొద్దిరోజులుగా అందాల సమంత (Samantha) బాలీవుడ్ ఎంట్రీ గురించి పలు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇంతలో సామ్. బాలీవుడ్‌లో ఓ వెబ్ సిరీస్‌కు కమిట్ అయింది. దానికి సంబంధించిన పనులు ప్రస్తుతం నడుస్తుండగా.. బాలీవుడ్ మూవీలోని సమంత పాత్ర గురించి ఓ అప్డేట్ బైటికొచ్చింది. దాని ప్రకారం ఇందులో ఆమె డ్యూయల్ రోల్స్ చేస్తున్నట్టు టాక్స్ వినిపిస్తున్నాయి. ఈ రెండు పాత్రలు వేటికవే డిఫరెంటట. ఆయుష్మాన్ ఖురానా (Ayushman Khurana) హీరోగా నటిస్తున్న ఈ సినిమా హ్యూమర్ అండ్ సస్పెన్స్ మిళితమైన కథాంశంతో తెరకెక్కబోతోంది. త్వరలోనే ఈ మూవీ కేస్టింగ్ అండ్ క్రూ వివరాలు తెలుస్తాయి.