//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

తాగుబోతు డ్రైవర్ ఒక మానవ బాంబు.

Category : national

మద్యం తాగి వాహనం నడుపుతున్న డ్రైవర్ల ప్రవర్తనకు ఢిల్లీ కోర్ట్ కొత్త నిర్వచనం తెలిపింది.తమ ప్రాణాలతోపాటు రోడ్డుపై ఉన్నవారిని చంపేందుకు సిద్ధపడ్డ ఆత్మహుతి బాంబర్లుగా వీరిని ప్రకటించింది.మద్యం మత్తులో వాహనాలు నడిపే డ్రైవర్లు ఆత్మాహుతి బాంబులతో సమానమని చెపుతూ మార్చి 13న తప్పతాగి వాహనాన్ని నడుపుతూ పట్టుబడిన రవి శంకర్‌ అనే వ్యక్తికి అయిదురోజుల జైలు శిక్షను విధించింది. ఏదో జరిమానా చెల్లించేసి వెళ్లిపోవడానికి కుదరదు అంటూ స్పష్టం చేసింది. కచ్చితంగా జైలు శిక్షను అనుభవించాల్సిందేనని సంబంధిత జిల్లా, సెషన్స్‌ జడ్జీ పేర్కొన్నారు.