//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

మునక్కాయే కాదు మునగాకులోనూ బోలెడన్ని పోషకాలు

Category : health

ఎండాకాలం వచ్చిందంటే చాలు. మునక్కాయ ప్రేమికులందరూ తెగ వండుకొని తినేస్తుంటారు. ఒక్క మునక్కాయలోనే కాదండోయ్ మునగాకులోనూ బోలెడన్ని పోషక విలువలు ఉన్నాయి. మునగాకు మహత్యం చెప్తే అసలు తినకుండా వదిలిపెట్టదు. అంత గొప్ప పోషకవిలువలున్న మునగాకును ప్రతిరోజు క్రమం తప్పక తింటే ఆరోగ్యంగా ఉంటారు అనడం లో ఎలాంటి సందేహం లేదు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. అలాంటి ఆరోగ్యాన్ని కాపాడుకోడానికి మునగాకు మంత్రాన్ని వాడాలనుకునే వాళ్ళు మునగాకు తో కలిగే ఉపయోగాలు ముందుగా తెలుసుకోవాలి.

మున‌గ ఆకును రోజూ ఉద‌యాన్నే ప‌ర‌గ‌డుపున తింటున్నా లేదంటే మున‌గ ఆకుల‌ను ఎండ‌బెట్టి పొడి చేసి ఆ పొడిని రోజూ తీసుకుంటున్నా దాంతో అనేక అద్భుత ఫ‌లితాలు క‌లుగుతాయి.మున‌గాకులో ప్రోటీన్లు కూడా ఎక్కువే ఉంటాయి. మాంసం తిన‌నివారు మున‌గ ఆకుల‌తో కూర చేసుకుని తింటే దాంతో శ‌రీరానికి ప్రోటీన్లు బాగా ల‌భిస్తాయి. శ‌రీరానికి పోష‌ణ స‌రిగ్గా అందుతుంది. పాల‌క‌న్నా 17 రెట్లు ఎక్కువ కాల్షియం మ‌న‌కు మున‌గాకు ద్వారా ల‌భిస్తుంది. దీంతో ఎముక‌లు దృఢంగా మారుతాయి. ఎదిగే పిల్ల‌ల‌కు మంచిది. దంతాలు దృఢంగా త‌యార‌వుతాయి. రోజుకి 7 గ్రాముల మునగాకు పొడిని మూడు నెలల పాటు రెగ్యులర్‌ గా తీసుకుంటే 13.5శాతం బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ తగ్గాయని పరిశోధనల్లో తేలింది. వీటిలో ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ ద్వారా బ్లడ్‌లో షుగర్‌ లెవల్స్‌ని అదుపులో ఉంచవచ్చు. దీంతో మ‌ధుమేహం ఉన్న వారికి మున‌గాకు చ‌క్క‌ని ఔష‌ధం అని చెప్ప‌వ‌చ్చు.

అర‌టిపండ్ల క‌న్నా 15 రెట్లు అధికంగా పొటాషియం మ‌న‌కు మున‌గాకు ద్వారా అందుతుంది. దీంతో గుండె స‌మ‌స్య‌లు పోగొట్టుకోవ‌చ్చు. ర‌క్త స‌ర‌ఫ‌రా కూడా మెరుగుప‌డుతుంది. థైరాయిడ్‌ను క్రమబద్ధీకరించే సహజమైన మందు మునగాకు. మునగాకులో ఎ, సి విటమిన్లు, క్యాల్షియం, పాస్ఫరస్‌, ఐరన్‌ కూడా అధికంగా ఉన్నాయి. ఐదు రకాల క్యాన్సర్లకు మునగాకు మంచి మందుగా పనిచేస్తుంది. లంగ్‌, లివర్‌, ఒవేరియన్‌, మెలానోమా వంటి క్యాన్సర్లను నిరోధించే సత్తా వీటికి ఉందని తాజా పరిశోధనల్లో తేలింది. యాంటీ ట్యూమర్‌గానూ మునగాకు పనిచేస్తుంది. మునగాకు రసాన్ని రోజూ తాగితే దృష్టి మాంద్యం, రేచీకటి తగ్గుతాయి. మునగాకులలో అమినో ఆమ్లాలు ఉండడంవల్ల మాంసకృత్తుల లోపాల వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలను అధిగమించవచ్చు. గర్భీణులకు, బాలింతలకు మునగాకు రసం ఎంతో మంచిది. వారికి అవసరం అయిన క్యాల్షియం, ఐరన్‌, విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి. తల్లులతోపాటు, పాలు తాగే పిల్లలు కూడా ఆరోగ్యంగా ఉంటారు. మునగాకు రసం రక్తహీనతను నివారిస్తుంది. మునగాకుల రసాన్ని పాలల్లో క‌లిపి పిల్లలకు అందిస్తే ఎముకలు బలంగా తయారవుతాయి.

ఇలా బోలెడన్ని ప్రయోజనాలను కలిగించే ఆరోగ్యప్రదాయిని, సహజ సంజీవిని మన కళ్ళెదురుగా కనిపిస్తున్న పట్టించుకోకుండా పోతుంటాం. మునగాకు ప్రయోజనాలు తెలుసుకున్న తర్వాత అయినా మునగ కాయలతోపాటు మునగాకును ఆరోగ్యం కోసమైనా ఆహారంలో భాగంగా చేసుకుందాం.