//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

డ్రైవ‌ర్ లెస్ ట్రాక్టర్‌

Category : business

డ్రైవ‌ర్ లెస్ కారు గురించి విన్న‌దే. అందుకు సంబంధించి ప్ర‌యోగాలు ప్ర‌పంచ‌వ్యాప్తంగా దిగ్గ‌జ కంపెనీలు జోరుగా చేస్తున్నాయి. వాహ‌న రంగంలో త‌మ‌దైన ముద్ర వేసిన మ‌హీంద్రా గ్రూపు తాజాగా స‌రికొత్త అధ్యాయానికి తెర తీసింది. ఢిల్లీలో ఏర్పాటు చేసిన కార్య‌క్ర‌మంలో తాము త‌యారు చేసిన డ్రైవ‌ర్ లెస్ ట్రాక్ట‌ర్ల‌ను ప్ర‌ద‌ర్శించి అంద‌రిని ఆశ్చ‌ర్యానికి గురించి చేసింది.

చెన్నైలో తామీ డ్రైవ‌ర్ లెస్ ట్రాక్ట‌ర్ల‌ను త‌యారు చేశామ‌ని దీంతో వ్య‌వ‌సాయ రంగంలో పెను మార్పులు చోటు చేసుకుంటాయ‌న్నారు. దేశంలో తామే తొలి డ్రైవ‌ర్ లెస్ ట్రాక్ట‌ర్‌ను రూపొందించిన‌ట్లుగా మ‌హీంద్రా పేర్కొంది. డ్రైవ‌ర్ లెస్ ట్రాక్ట‌ర్ల‌ వ్య‌వ‌సాయ రంగానికి ఎంతో సాయం చేస్తుంద‌న్న మాట కంపెనీ చెబుతోంది. రానున్న కొద్ది రోజుల్లో మ‌హీంద్రా ట్రాక్ట‌ర్ల‌ అన్నింటికి ఈ సాంకేతిక‌త‌ను వ‌ర్తించేలా చేస్తామ‌ని సంస్థ పేర్కొంది. డ్రైవ‌ర్ లెస్ ట్రాక్ట‌ర్ల భార‌త రైతాంగానికి ప్ర‌త్యేక ప్ర‌యోజ‌నాల్ని చేకూరుస్తుంద‌న్నారు. ఈ సాంకేతిక‌త‌ను 20 హెచ్ పీ నుంచి 100 హెచ్ పీ సామ‌ర్థ్యం ఉన్న ట్రాక్ట‌ర్ల‌లో అందుబాటులోకి తేనున్న‌ట్లుగా కంపెనీ వెల్ల‌డించింది.