//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

లెక్కలు చెయ్యలేకపొతే, చుక్కేసి చుడండి

Category : health editorial

శరీరానికి ఎక్సర్ సైజ్ ఎలానో అలానే మెదడుకూ ఎక్సర్ సైజ్ కావాలంటే లెక్కలు చేయడం ఒక మార్గం అయితే రెండో మార్గం మందు కొట్టడం అని 'యెల్ స్కూల్ అఫ్ మెడిసిన్' కు చెందిన 'గార్డన్ షెప్పర్డ్' అనే న్యూరో సైంటిస్ట్ తెలుపుతున్నారు. మద్యం తాగే ముందు వాసనను ఆస్వాదించి, తరువాత రుచిని ఆస్వాదించాలంటే మెదడుకు ఎంతో పని చెప్పినట్లేనన్నమాట. నోట్లో కొంచెం మద్యం పోసుకొని దాని రుచి కోసం నాలుక అంగిలి చుట్టూ అలా పుక్కట బడితే నాలుక, రుచి చూసే గ్రంధులు, ముక్కులో వుండే వాసనను గ్రహించే గ్రంధులు అన్ని కలిసి పనిచేయవలసి ఉంటుంది. ఈ మొత్తం విధానం ఎంత క్లిష్టమైనదంటే ఏదైనా పెద్ద చిక్కు లెక్కను పరిష్కరించినప్పుడు, మంచి సంగీతాన్ని ఆస్వాదించినపుడు జరిగే ప్రక్రియలకన్నా మెదడును ఎక్కువగా ఉత్తేజపరుస్తాయి. మెదడు మనల్ని మాయ చేస్తుంది. సువాసనతో కూడిన రుచిని సృష్టిస్తుంది.

మద్యం నోటిలో పోసుకున్నప్పుడు, మద్యం ఆవిరి ముక్కును తాకినప్పుడు ఈ రెండింటిని కలిపి మెదడు ఒక సుగంధ భరితమైన రుచిని సృష్టించి మనకు ఆహ్లాదం కలిగిస్తుంది. నిజం ఏమిటంటే మద్యం చుక్కల్లో రుచి కానీ వాసన కానీ ఉండవు. మద్యం మన మెదడును ఉత్తేజపరచినప్పుడు రుచి, వాసన మన అనుభవంలోకి వస్తాయి. షెప్పర్డ్ తన పుస్తకం "న్యూరో యినోలజి" లో ఇలాంటి ఎన్నో విషయాలను వివరించారు. ఒకే మద్యం త్రాగేవారి వయస్సు, అనుభవం, ఆడ, మగ అన్న అంశంను బట్టే దాని రుచి సువాసన అనుభవంలోకి వస్తాయి. అతిగా సేవిస్తే మెదడుకి పని ఎక్కువై హ్యాంగోవర్ కు దారితీస్తుందన్నమాట.

Related News