//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

చిత్తూరు ఎంపీ రేసులో కొత్త పేరు ?

Category : politics

దేశవ్యాప్తంగా మరో ఏడాదిలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో కూడా సార్వత్రిక ఎన్నికలకు ఇంకా సంవత్సరమే సమయం ఉంది. దీన్ని దృష్టిలో పెట్టుకొని కొత్తగా రాజకీయాలలోకి వచ్చేవాళ్ళు, పార్టీ మారే జంప్ జిలానీలు ఎక్కువయిపోయారు.

కొంతమంది నేతలు ఇప్పటికే వైసీపీ గూటికి చేరడానికి సన్నాహాలు మొదలు పెట్టారు. మరోపక్క కొత్తగా పార్టీ లోకి చేరేవారు కూడా తమ ప్రయత్నాలను మొదలుపెట్టారు. ద్రావిడ యూనివర్సిటీ మాజీ వైస్‌ ఛాన్సలర్‌ రత్తయ్య త్వరలో వైసీపీ పార్టీ లో చేరబోతున్నట్టు చెప్పారు.

అయన ఈ రోజు ఎస్‌ఆర్‌ పురం మండలంలోని మంగుంట శ్రీలక్ష్మినరసింహ స్వామి దర్శనం అనంతరం మాట్లాడుతూ చెప్పారు. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో చిత్తూరు ఎంపీ సీటు తాను ఆశిస్తున్నట్టు అయన చెప్పారు.