//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

పాకిస్థాన్ క్రికెటర్లతో ద్రావిడ్...!

Category : sports

అండర్‌ - 19 వరల్డ్‌ కప్‌ సెమీ ఫైనల్ మ్యాచ్ లో విజయం అనంతరం తాను పాకిస్థాన్ ఆటగాళ్ల డ్రస్సింగ్ రూమ్ కు వెళ్లినట్టు వచ్చిన వార్తలపై జట్టు చీఫ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ స్పందించాడు.

తనపై జరుగుతున్న ప్రచారమంతా అవాస్తవమని చెప్పారు. న్యూజిలాండ్ నుంచి భారత్ కు వచ్చిన తరువాత ముంబైలో రాహుల్ మీడియాతో మాట్లాడాడు. తమ దేశపు ఆటగాళ్లలో స్ఫూర్తి నింపాలని జట్టు మేనేజర్ నదీమ్ ఖాన్ ఆహ్వానించాడని, ఆయన కోరికను మన్నించి తాను వారి వద్దకు వెళ్లి మాట్లాడానని వచ్చిన వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశాడు.

తానేమీ వారి డ్రస్సింగ్ రూమ్ కు పోలేదని చెప్పిన ఆయన, పాక్ ఆటగాళ్లలోని ఓ ఎడమచేతి వాటం పేస్ బౌలర్ ను అభినందించానని, అది కూడా డ్రస్సింగ్ రూమ్ లో కాదని తెలిపాడు. తాను పాక్ కుర్రాళ్లతో మాట్లాడలేదని అన్నాడు. పాక్ కోచ్ సైతం భారత ఆటగాళ్లను అభినందించాడని చెప్పాడు. అంతకుమించి మరేమీ జరగలేదని అన్నాడు.