//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

ఈవీఎం టాంపరింగ్‌ పై కొనసాగుతున్న అనుమానాలు

Category : national

ఈవీఎం టాంపరింగ్‌ సాధ్యం కాదని భారత ఎన్నికల సంఘం ఈ మధ్య బహిరంగ సవాల్‌ విసిరి స్పష్టం చేసినా ఇంకా అనుమానాలు కొనసాగుతూనే ఉన్నాయి. టాంపరింగ్ సాధ్యమే అంటూ కొన్ని సంఘటనలు నిరూపిస్తున్నాయి.   తాజాగా మహారాష్ట్రలో జరిగిన స్థానిక ఎన్నికల్లో ఏర్పాటు చేసిన ఈవీఎంల పనితీరుతో ఈ విషయం మరింత స్పష్టమవుతోంది.

ఓటర్లు స్వతంత్ర అభ్యర్థికి ఓటు వేసినప్పుడు, ఆ బటన్‌కు కింద వేరే పార్టీ అభ్యర్థికి కేటాయించిన గుర్తుకు ఎదురుగా ఉన్న లైటు వెలుగుతోంది. దీంతో అభ్యంతరం తెలిపిన ఓటర్లు తమ ఓట్లు వేయకుండా నిరసన తెలిపారు. అధికారులు వెంటనే పోలింగ్‌ను నిలిపివేసి ఉన్నత అధికారులకు సమాచారం ఇచ్చారు.

ఓటింగ్‌ యంత్రంలో లోపం వుందని నిర్ధారించుకున్న అధికారులు మరో ఓటింగ్‌యంత్రాన్ని ఏర్పాటుచేసి పోలింగ్‌ నిర్వహించారు. అయితే అప్పటి వరకు పోలైన ఓట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు పోలయ్యాయి అనే విషయాన్ని అధికారులు గోప్యంగా ఉంచారు.

దీనిపై సమాచార హక్కు చట్టం ద్వారా గల్గాలీ అనే వ్యక్తి వివరణ కోరగా అధికారులు ఈవీఎం తప్పుగా పని చేసినట్లు తెలిపారు. దీనిపై గల్గాలీ మాట్లాడుతూ ఈవీఎం టాంపరింగ్‌ సాధ్యమేనని ఈ సంఘటన ద్వారా రుజువైందని స్పష్టం చేశారు. అందువల్ల ఎన్నికల సంఘం ఓటింగ్‌ యంత్రాల స్థానంలో వేరే పద్ధతులను అవలంభించాల్సిన అవసరం ఉందని కోరారు .