//single page style gallary page

Questions? reply in 15 minutes!

Questions? reply in 15 minutes!

వైఎస్ వివేకా మృతిపై అనుమానాలు..

Category : politics state

మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడు, వైఎస్ వివేకానందరెడ్డి మరణంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ రోజు తెల్లవారుజామున గుండెపోటు తో మృతి చెందారని మొదట భావించినా , వివేక రక్తపు మడుగులో పడివుండటం, తల, చేతిపై బలమైన గాయాలు ఉండటంతో ఆయన మృతి వెనుక ఏమైనా కుట్ర కోణం ఉందా అన్న అనుమానాలు రేకెత్తుతున్నాయి .

వివేకానందరెడ్డి పులివెందులలోని స్వగృహంలో శుక్రవారం తెల్లవారుజామున గుండెపోటుతో మరణించారను సహజ మరణం అని అందరూ భావిస్తే తాజాగా ఆయన మరణం వెనుక అనుమానాలు రావడంతో వైసీపీ శ్రేణుల్లో ఆందోళన నెలకొంది.దీనిపై వివేకానందరెడ్డి పీఏ కృష్ణారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు ఇయన ఇంటిని డాగ్‌స్వ్కాడ్ సాయంతో తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇది సహజ మరణమా లేకా మరేదైనా జరిగిందా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.